/rtv/media/media_files/2025/05/13/udfh3kdWV2zAdpcKFVRf.jpg)
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ఉగ్రదాడికి ధీటుగా భారత్..ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాకిస్తాన్ అక్రమ కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరలపై వైమానిక దాడులు చేసి దాదాపు వందమంది ఉగ్రవాదలను హతం చేసింది.
Also read : IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI
హిందువులు, ముస్లింలు వేరంటూ
పహల్గాం ఉగ్రదాడికి ముందు హిందువులు, ముస్లింలు వేరంటూ సంచలన కామెంట్స్ చేసిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ అహ్మద్ షా ఆ తరువాత కనిపించకుండా పోయారు. కనీసం మీడియా సమావేశాల్లోనూ పాల్గొనలేదు. దీంతో ఆయన దేశం వదిలి పారిపోయారంటూ సోషల్ మీడియలో వార్తలు వచ్చాయి. పాక్ ఆర్మీ చీఫ్ తన కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోయారని లేదా రావల్పిండిలోని బంకర్‌లో దాక్కున్నారంటూ విమర్శలు వచ్చాయి.
Asim Munir is meeting Pakistan Army soldiers injured in #OperationSindoor. Why isn’t he revealing names of Pakistan Army soldiers killed in LoC Artillery firing and during attacks at various Airbases? 50+ soldiers at LoC and 35-40 soldiers in Airstrikes. pic.twitter.com/9g1LNS4ixH
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 12, 2025
భారత్, పాక్ దేశాల మధ్య కాల్పులు విరమణ తరువాత మళ్లీ అసిమ్ మునీర్ ఎట్టకేలకు బయటకు వచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో గాయపడిన పాకిస్తాన్ ఆర్మీ సైనికులను అసిమ్ మునీర్ కలుస్తున్నారు. ఎల్‌ఓసి వద్ద 50+ సైనికులు, వైమానిక దాడులలో 35 నుంచి 40 మంది సైనికులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన పాక్ ఆర్మీ సైనికులను పాక్ ఇంత వరకు బయటపెట్టలేదు.
Also read : RO-KO : కోహ్లీ, రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడరు.. భారత లెజెండ్ సంచలన వ్యాఖ్యలు