/rtv/media/media_files/2025/12/25/another-hindu-man-lynched-in-bangladesh-2025-12-25-21-39-48.jpg)
Another Hindu Man Lynched In Bangladesh
బంగ్లాదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. దీపు చంద్రదాస్ హత్య ఘటన మరువకముందే మరో హిందూ యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపడం కలకలం రేపుతోంది. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. డబ్బు వసూళ్లు చేసినందుకు గ్రామస్థులు అతడిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌బర్ జిల్లాలోని పంగ్షా సర్కిల్‌లో అమృత్ మొండల్ (29) అనే యువకుడిపై బుధవార రాత్రి స్థానికులు దాడికి పాల్పడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
Also Read: ఎన్నికల్లో అభ్యర్థుల సంచలన హామీలు.. ఓటేస్తే కారు, ల్యాండ్, థాయ్‌లాండ్ ట్రిప్
అమృత్‌ను స్థానిక ఆస్పత్రికి తరలిచారు. చికిత్స తీసుకుంటూ అతడు గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. అమృత్ అనుచరుల్లో ఒకరైన మొహ్మద్ సెలిమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి పిస్టల్, షూటర్ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే అసాంఘిక కార్యకలాపాలు, డబ్బులు వసూలు చేయడం కోసం అమృత్.. సామ్రాట్ బహిన్ పేరుతో ఓ క్రిమినల్ గ్యాంగ్‌ను నడిపిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు ఓ హత్యానేరంతో పాటు మరో కేసు అతడిపై నమోదైనట్లు పేర్కొన్నారు.
After how many Hindu lives are lost will this atrocity become "acceptable"?
— Kamalraj Singh (@kamalrajsingh_) December 25, 2025
Another Hindu has been killed.
Amrit Mandal (29) was beaten to death in Bangladesh, and "Allahu Akbar" slogans were raised.
These radical Muslims commit violence everywhere.#AllEyesOnBangladeshiHinduspic.twitter.com/2tx5D8089S
Also Read: షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో జరిగిన మార్పులు..
షేక్ హసీనా దేశం నుంచి వెళ్లిపోయిన తర్వాత అమృత్ కొన్నిరోజుల పాటు ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇటీవలే తన గ్రామానికి చేరుకున్నాడు. అయితే బుధవారం రాత్రి తన గ్రామానికి చెందిన ఓ షాహిదుల్ ఇస్లాం అనే వ్యక్తి ఇంటికెళ్లి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో ఇస్లాం కుటుంబ సభ్యులు గట్టిగా అరవడంతో చుట్టు పక్కల వాళ్లు అందరూ వచ్చి అమృత్‌పై దాడి చేశారు. అతడి అనుచరులు కొందరు పారిపోగా.. మొహమ్మద్ ఒక్కడే తమకు చిక్కినట్లు పోలీసులు చెప్పారు. దీపు హత్య తర్వాత మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపడం చర్చనీయాంశమవుతోంది.
Follow Us