/rtv/media/media_files/2025/09/28/three-dead-in-gun-shooting-in-america-2025-09-28-18-44-32.jpg)
Three dead in gun shooting in America
Shooting : అమెరికాలో గన్ కల్చర్ మారటం లేదు. ప్రతిసారి ఏదో ఒక ప్రాంతంలో దుండగులు కాల్పులకు తెగపడుతున్నారు. తాజాగా మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. అమెరికా నార్త్ కరోలినా (North Karolina) లోని సౌత్ పోర్ట్ వద్ద ఉన్న డాక్ సైడ్ రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రెస్టారెంట్లో గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇది కూడా చూడండి: Weather Update: తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు.. రెండు రోజులు దంచుడే దంచుడు
సౌత్ పోస్ట్ యాచ్ బేసిన్ ప్రాంతంలోని అమెరికన్ ఫిష్ కంపెనీ అనే ఫేమస్ రెస్టారెంట్ వద్దకు దుండగుడు ఒక చిన్న పడవలో వచ్చినట్లు తెలుస్తోంది. అలా వచ్చిన నిందితుడు కొద్దిసేపు అక్కడే తచ్చాడాడు. అనంతరం రద్దీగా ఉన్న జనం గుంపును ఎంచుకుని వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
విషయం తెలిసిన వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేశారు. అయితే కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. కాగా, ఈ నెల 24న కూడా డల్లాస్‌లోని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఫీల్డ్ ఆఫీసుపై దుండుగుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.ఈ కాల్పుల్లో ఒకరు మరణించారు. అనంతరం నిందితుడు తనకు తానే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!