/rtv/media/media_files/2025/09/26/little-hearts-ott-2025-09-26-20-29-44.jpg)
LITTLE HEARTS OTT
Little Hearts OTT: ఈ ఏడాది టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండానే విజయం సాధించిన చిత్రాల్లో 'లిటిల్ హార్ట్స్' ఒకటి. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యూత్ ఎంటర్‌టైనర్ భారీగా కలెక్షన్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మౌళి తనుజ్ ప్రశాంత్, శివాని నగరం లీడ్ రోల్స్‌లో నటించి ఆకట్టుకున్నారు.
తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం, మంచి మౌత్ టాక్‌తో దూసుకెళ్లి రూ. 35 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. యువతను ఆకట్టుకునే కథ, కామెడీ, ఎమోషన్స్ ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
The blockbuster rom-com of the year coming to your home…💖
— ETV Win (@etvwin) September 26, 2025
This time longer, sweeter & crazier!💞
Little Hearts (Extended Cut 🤩)
A WIN Original Production
Streaming from Oct 1 only on @etvwin@marthandsai#AdityaHasan@mouli_talks@shivani_nagaram@TheBunnyVas… pic.twitter.com/zc12LfIhQl
ఎట్టకేలకు ఓటీటీలోకి..
ఇప్పుడు చాలా మంది ఎదురుచూస్తున్న లిటిల్ హార్ట్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా అక్టోబర్ 1 నుంచి ETV Win ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కి రానుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి రావడం విశేషం. మొదట్లో ఈ సినిమా డిజిటల్‌గా త్వరగా రాదని వార్తలు వచ్చినా, మేకర్స్ ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.
ఓటీటీలో స్పెషల్ సర్‌ప్రైజ్..
ETV Winలో స్ట్రీమింగ్ అయ్యే వెర్షన్‌లో ఎక్స్‌టెండెడ్ కట్ ఉండబోతోంది. అంటే థియేటర్లలో చూపించని కొన్ని అదనపు సన్నివేశాలను ఇప్పుడు ఓటీటీలో చూపించనున్నారు. ఆ సీన్స్ డిజిటల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు.
ఈ చిత్రానికి సింజిత్ ఎర్రమిల్ల సంగీతాన్ని అందించారు. ఆయన మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమాకు అవసరమైన హ్యూమర్, ఎమోషన్స్, ఫ్రెష్‌నెస్ అన్నింటినీ బాగా కలిపి తెరకెక్కించడంలో దర్శకుడు సాయి మార్తాండ్ విజయవంతమయ్యారు. ఈ సినిమాను ETV Win బ్యానర్‌పై ఆదిత్య హసన్ నిర్మించారు.
మొత్తానికి, థియేటర్‌లో విజయవంతం అయిన లిటిల్ హార్ట్స్ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఎక్స్‌టెండెడ్ కట్ తో పాటు మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమా, అక్టోబర్ 1 నుంచి ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే చూసేయొచ్చు.