PM Modi: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాని మోదీ వాచ్ ..దీని ఖరీదు ఎంతో తెలుసా?

ఎప్పుడూ లేనిది ప్రధాని మోదీ వాచీ ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో అందరూ ఇది ఏం వాచ్ అంటూ సెర్చ్ చేస్తున్నారు. నడుస్తున్నపులి, రూపాయి నాణెంతో ఉన్న ఈ వాచ్ ప్రత్యేకత ఏంటో చూద్దామా..

New Update
pm modi watch

రీసెంట్ గా జరిగిన బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో ాయన చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. దాంతో ఇంటర్నెట్ లో దీని గురించి సెర్చ్ చేయడం మొదలెట్టారు. ఇదొక మేక్ ఇన్ ఇండియా వాచ్. మేక్ ఇన్ ఇండియా వస్తువులను వాడమని చెప్పడమే కాక స్వయంగా తానే ఇక్కడ తయారు అయిన వాచ్ ను వాడుతూ ప్రధాని మోదీ అందరికీ ఆదర్శంగా నిలిచారనే చెప్పవచ్చును. మోదీ పెట్టుకున్న వాచ్ జైపూర్ లో తయారైంది. దీని పేరు రోమన్ బాగ్. ఇది కేవలం వాచ్ మాత్రమే కాదు భారతీయ కళాత్మక, వారసత్వానికి ప్రతీక నిలుస్తోంది. ఈ రోమన్ బాగ్ వాచ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టే మరో అంశం దాని డయల్. దీని మధ్యలో 1947 నాటి అసలు రూపాయి నాణెం ఉంటుంది. ఇది ఒక రూపాయి నాణెం బొమ్మ.  ఈ నాణెంపై భారతదేశపు ప్రత్యేక చిహ్నం అయిన నడుస్తున్న పులి బొమ్మ కూడా ముద్రించబడి ఉంది. నాణెంపై 1947 సంవత్సరం కూడా కనిపిస్తుంది. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది..అక్కడ నుంచీ దేశం తనదైన గుర్తింపును పెంచుకుంటూ.. స్వయం సమృద్ధి దిశగా వేసిన శక్తివంతమైన అడుగుకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోమన్ బాగ్ వాచ్‌ను ఆధునిక ఇంజనీరింగ్‌తో రూపొందించారు.

స్వదేశీ బ్రాండ్..

ఈ రోమన్ బాగ్ వాచ్.. మన్నికైన 316ఎల్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన 43 మిల్లీమీటర్ల కేస్‌ను కలిగి ఉంది. ఇందులో జపనీస్ మియోటా ఆటోమేటిక్ మూవ్‌మెంట్ ఉపయోగించారు. దీనికి గీతలు పడకుండా ఉండేందుకు ముందు, వెనుక భాగాల్లో నీలమణి క్రిస్టల్స్‌ను ఉపయోగించారు. ఇక ఈ రోమన్ బాగ్ వాచ్ ధర సుమారుగా రూ.55 వేల నుంచి రూ.60 వేల మధ్య ఉండవచ్చని చెబుతున్నారు. గౌరవ్ మెహతా స్థాపించిన ఈ జైపూర్ వాచ్ కంపెనీ.. అరుదైన భారతీయ జ్ఞాపకాలు, నాణేలు, స్టాంపులు, సాంప్రదాయ డిజైన్‌లను లగ్జరీ గడియారాలుగా మార్చడంలో ప్రసిద్ధి చెందింది. ప్రధాని మోదీ ఈ స్వదేశీ బ్రాండ్‌ను ఎంచుకోవడం ద్వారా.. భారత్‌లో పెరుగుతున్న దేశీయ బ్రాండ్ల నాణ్యత, క్రియేటివిటీని ప్రపంచ వేదికపై చాటిచెప్పడానికి సిద్ధంగా ఉన్నాయనే సందేశాన్ని ఇస్తున్నట్టుగా ఉంది. 

Also Read: Anmol Bishnio: లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ ను బహిష్కరించిన యూఎస్..భారత్ కు రప్పించే ప్రయత్నం

Advertisment
తాజా కథనాలు