/rtv/media/media_files/2025/12/05/social-media-2025-12-05-11-38-11.jpg)
అమెరికా కలలను ట్రంప్ గవర్నమెంట్ శాశ్వతంగా క్లోజ్ చేసేస్తోంది. ఒక్కొక్క రూల్ ను ప్రవేశపెడుతూ అమెరికా దారులను మూసేస్తున్నారు. ముఖ్యంగా హెచ్1 వీసాలపై కఠిన నియమాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీసా ఫీజలను లక్ష డాలర్లకు పెంచేసి చాలా మంది అమెరికా రాకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు విదేశీయులను తీసుకురావడానికి అమెరికన్ కంపెనీలు కూడా వెనుకంజ వేస్తున్నాయి. తాజాగా మరో కొత్త రూల్ ను హెచ్ 1 వీసాదారుల నెత్తిపై బాంబ్ లా వేశారు. అదే సోషల్ మీడియా స్క్రీనింగ్ తప్పనిసరి. డిసెంబర్ 15 నుంచి అమెరికాకు వచ్చే వారందరూ తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ నుంచి పబ్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏ మాత్రం అనుమానాస్పదంగా కనిపించినా ఆ వీసాలను తిరస్కరిస్తారు.
అసలేంటీ సోషల్ మీడియా స్క్రీనింగ్..
సోషల్ మీడియా...ఇప్పుడు ఇది అందరి జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. సోషల్ మీడియాలో ఖాతా లేకుండా దాదాపుగా ఎవరూ ఉండరు. అయితే కొంత మంది ఇందులో యాక్టివ్ గా ఉంటే మరి కొంత మంది కేవలం వినోదం కోసం మాత్రమే యూజ్ చేస్తారు. ఈ క్రమంలో చాలా మంది తమ ఖాతాలను ప్రైవేట్ గా పెట్టుకుంటారు. పోస్ట్ లు పెడుతున్నా..ఇతరులపై తమ ఖాతాల్లోకి వచ్చి అసభ్యకరమైన కామెంట్స్ చేయడం లేదా పోస్ట్ లను కాపీ కొట్టడం, ఫోటోలను తీసుకోవడం లాంటివి చేస్తుంటారు. అలాంటివి జరగకుండా ఉండడానికి ప్రైవసీ కోసం తమ ఖాతాలను ప్రైవేట్ లో పెట్టుకుంటారు. అయితే ఇలా సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ లో పెట్టుకుని అడ్డదారులు తొక్కేవారు, ఇల్లీగల్ కార్యకలాపాలకు పాల్పడేవారు కూడా కొందరు ఉంటారు. తమను ఎవరూ గుర్తించకుండా ఉండడానికి, ఎలాంటి పని చేసినా దొరికిపోకుండా ఉండడానికి కూడా ఈ ప్రైవేట్ ఆప్షన్ ను వాడతారు.
డిసెంబర్ 15 నుంచే అమల్లోకి..
అయితే ఇప్పుడు అమెరికా వీసా కావాలనుకునే వారు తమ సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పబ్లిక్ గా ఉంచుకోవాలి. వీసాలను ఇష్యూ చేసేటప్పుడే వీటిని స్క్రీనింగ్ చేయనున్నారు. డిసెంబర్ 15 నుంచే ఇది అమలులోకి రానుంది. హెచ్1బీ వీసా, వారి కుటుంబసభ్యలకు ఇచ్చే వీసాలు ఏవైనా సరే వారి ఖాతాలను తప్పనిసరిగ పబ్లిక్ లో ఉంచుకోవాల్సిందే. ఏ మాత్రం గోప్యత పాటించినా లేదా..సోషల్ మీడియాల్లో అమెరికా, అక్కడి ప్రభుత్వం లేదా ఏ ఇతర కార్యకలాపాలకు సంబంధించిన అవాంఛిత పోస్ట్ లు కనిపించినా వెంటనే వీసాలను రిజెక్ట్ చేస్తారు. ఇది అమెరికా డిజిటల్ ఫుట్‌ప్రింట్ పాలసీలో ఒక పెద్ద విస్తరణ అనిఇమ్మిగ్రేషన్ నిపుణులు అంటున్నారు. ఈ రూల్ ను ఇంతకు ముందు అమెరికా వచ్చే విదేశీ విద్యార్థులకు అమలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మొత్తం అన్ని వీసాదారులకూ ఈ రూల్ ను అమలు చేయనున్నారు. వీసా అధికారులు సోషల్ మీడియా ప్రొఫైల్‌లు, పబ్లిక్ పోస్ట్‌లు మరియు ఆన్‌లైన్ డేటాబేస్‌లలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తారు.
ఎప్పుడైనా, ఎక్కడైనా తనిఖీ..
వీసాకు దరఖాస్తు చేసుకున్న ఎవరైనా తమ సోషల్ మీడియాలను ప్రైవేట్ గా ఉంచడానికి వీలు లేదు. అలాగే US పౌరులు, సంస్థలు లేదా సంస్కృతి పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉన్న పోస్ట్ లు, ప్రకటనలూ...లేదా ఏదైనా ఉగ్రవాద గ్రూపుకు మద్దుతుగా పోస్ట్ లు కనిపించినా వెంటనే వీసాలను తిరస్కరిస్తారు. దాంతో పాటూ యూఎస్ కు సంబంధించిన ఏదైనా టెక్నాలజీని దర్వినియోగం చేస్తున్నారా అని కూడా అధికారులు పరిశీలిస్తారు. ఈ కొత్త నియమాలు భారతీయులపై, ముఖ్యంగా ఐటీ నిపుణులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఇది కేవలం కొత్తగా వీసాలను అప్లై చేసే వారికే కాదు..ఇప్పటికే వీసాలున్న వారికి కూడా వర్తిస్తాయి. ఆల్రెడీవీసాలున్నవారు అమెరికా వదిలి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా సోషల్ మీడియా స్క్రీనింగ్ ను చేయనున్నారు. ఇది ఎయిర్ పోర్ట్ లలో కూడా జరగవచ్చని చెబుతున్నారు. అమెరికా వచ్చే విదేశీయులు ఎవరైనా, ఎప్పుడైనా తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ లోనే ఉంచుకోవాలని, అన్యూజువల్ కంటెంట్ లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు.
Follow Us