అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి

మరో విమాన ప్రమాదం అమెరికాలో చోటుచేసుకుంది. ఫిలడెల్పియాలో షాపింగ్ మాల్ సమీపంలో విమానం ఇళ్లపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. సమీపంలోని కార్లు, ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

New Update
Philadelphia

Philadelphia Photograph: (Philadelphia)

అమెరికాలో మరో భారీ విమాన ప్రమాదం జరిగింది. ఫిలడెల్పియాలో షాపింగ్ మాల్ సమీపంలో విమానం ఇళ్లపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగరు మృతి చెందారు. ఆ ప్రాంతంలోని కార్లు, ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఎక్కువగా చెలరేగడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు మరణించినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Karthikeya 3: కార్తికేయ-3 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!

ఇది కూడా చూడండి: Cricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం

విమానంలోని ప్యాసెంజర్లు అంతా..

ఇటీవల అమెరికాలోని వాషింగ్టన్ లో విమాన ప్రమాదం జరిగింది. రీగన్ ఎయిర్ పోర్ట్ లో ఒకేసారి అమెరికన్ ఎయిర్ లైన్స్, ఆర్మీ హెలికాఫ్టర్ ల్యాండ్ అవడం వలన భారీ ప్రమాదం ఏర్పడింది. విమానాన్ని హెలికాఫ్టర్ అడ్డంగా ఢీకొట్టడంతో..రెండు ముక్కలు అయ్యి.. ఎయిర్ ప్లేన్, హెలికాఫ్టర్ రెండూ పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో పడిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ఉన్న 65 మంది ప్యాసెంజర్లు, నలుగురు సిబ్బంది...ఆర్మీ హెలికాఫ్టర్ లో ఉన్న ముగ్గురు జవాన్లు చనిపోయారు. ఒక్కరు కూడా ప్రాణాలతో మిగిల్లేదు. ఫ్లైట్ లో ఉన్న 12 మంది ఇంటర్నేషనల్ ఐస్ స్కేటింగ్ ప్లేయర్లు కూడా మరణించారు. 

 

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!

ఇది కూడా చూడండి:  Chennai Crime: ఏసీ ఆన్‌ చేసి..రసాయనాలు చల్లుతూ...వీడిన చెన్నై తండ్రికూతుళ్ల డెత్‌ మిస్టరీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు