భారత్‌కు అనుకూలంగా మారనున్న అమెరికా-చైనా ట్రేడ్‌ వార్..!

అమెరికా , చైనా మధ్య ట్రేడ్‌ వార్ కొనసాగుతూనే ఉంది. ఇది భారత్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనా తమ ఎగుమతులను అమెరికాకు కాకుండా ఎక్కువగా భారత్‌కు పంపించే ఛాన్స్ ఉంటుంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
America, China Trade War

America, China Trade War

అమెరికా , చైనా మధ్య ట్రేడ్‌ వార్ కొనసాగుతూనే ఉంది. అమెరికా చైనాపై 145 శాతం టారిఫ్‌ విధిస్తే.. దీనికి పరస్పరంగా చైనా 125 శాతం టారిఫ్‌ పెంచింది. అయితే ఓ డేటా ప్రకారం అమెరికా, చైనా మధ్య 2024లో 582.4 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరిగినట్లు అంచనా ఉంది. 143.5 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా వస్తువులు చైనాకు ఎగుమతి కాగా.. చైనా నుంచి అమెరికాకు 438.9 బిలియన్ డాలర్ల వస్తువులు దిగుమతి అయ్యాయి. మొత్తానికి ఇక్కడ అమెరికానే చైనా నుంచి ఎక్కువ వస్తువులు దిగుమతి చేసుకుంటోంది.  అమెరికాకు వస్తువులు దిగుమతి చేయడంలో మెక్సికో, కెనడా తర్వాత చైనానే ముడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశంగా ఉంది. 

2024లో 13.3 శాతం చైనా వస్తువులు అమెరికాకు దిగుమతి అయ్యాయి. వాషింగ్‌ మెషిన్లు, టీవీలు, టెక్స్‌టైల్స్, ఫర్నీచర్ ఇంకా ఇతర ఉత్పత్తులను అమెరికాకు చైనా సరఫరా చేస్తోంది.  అయితే అమెరికా చైనా వస్తువులపై 145 శాతం టారిఫ్ విధించడంతో ఇప్పుడు వీటి ధరలు మరింత పెరగనున్నాయి. దీనివల్ల అమెరికా ప్రజలు వీటిని కొనడం మరింత కష్టతరమవుతుంది. ఫలితంగా చైనా వస్తువులకు డిమాండ్ తగ్గిపోతుంది.

Also Read: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే?

అయితే అమెరికా, చైనా మధ్య ట్రేడ్‌ వార్‌ భారత్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనా తమ ఎగుమతులను అమెరికాకు కాకుండా ఎక్కువగా భారత్‌కు పంపించే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, ఫర్నీచర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెమికండక్టర్స్ లాంటివి ఎక్కువగా అమెరికాకు చైనా నుంచి ఎగుమతి అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఎగుమతులు ఎక్కువగా భారత్‌కు మళ్లించే ఛాన్స్ ఉంటుంది. 

అలాగే వీటికి సంబంధించిన పరిశ్రమలు భారత్‌లో ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. చైనా నుంచి అమెరికాకు 29.7 శాతం టెక్స్‌టైల్‌ ఎగుమతి అవుతోంది. కాబట్టి ఈ టారిఫ్‌ల ప్రభావం వల్ల ఇప్పుడు భారత్‌లో టెక్స్‌టైల్‌ రంగానికి ఎక్కువగా లాభం ఉంటుంది. ఈ రంగంలో మరిన్ని పరిశ్రమలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. టారిఫ్‌లు ఇలాగే కొనసాగితే ఇక చైనా తమ పెట్టుబడులు, పరిశ్రమలను అమెరికాలో కాకుండా భారత్‌ వైపే మొగ్గు చూపొచ్చు. భారత ప్రభుత్వం కూడా చైనా నుంచి వీటిని ఆకర్షించేందుకు మరిన్ని సౌకర్యాలు అందించాల్సి ఉంటుంది. దీనివల్ల భారత్‌కు లాభం చేకూరడంతో పాటు చైనా ఇక నుంచి మనపైనే ఎక్కువగా ఆధారపడేందుకు మార్గం సుగమం అవుతుంది.     

Also read: వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 110 మంది అరెస్టు

trump tariffs | telugu-news | rtv-news | national-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు