Amazon: ఉద్యోగులకు ఊహించని షాక్.. 5 లక్షల మంది ఔట్!

ఆటోమేషన్ కాదు, ఏఐ అంతకంటే కాదు...అమెజాన్ ఏకంగా రోబోలను రంగంలోకి దించేసింది. వీటి ద్వారా 5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనుంది. దీంతో 75 శాతం పనిని ఆటోమేట్ చేవచ్చని అంచనా వేస్తోంది. 

New Update
robo

ఏఐ వచ్చి ఇప్పటికే చాలా ఉద్యోగాలను త సొంతం చేసేసుకుంది. ఏఐను అడాప్ట్ చేసుకుంటున్న కంపెనీలు చాలా మంది ఉద్యోగాలను నుంచి తీసేస్తున్నారు. దానికి తోడు ఖర్చులను తగ్గించుకోవడానికి , వీసాల బాధ నుంచి తప్పించుకోవడానికి కూడా లేఆఫ్‌లను చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన అమెజాన్ కూడా ఈ ఏడాది భారీగా ఉద్యోగాలను పీకిపారేసింది. ఇప్పుడు మరో 5 లక్షల మందికి ఎసరు పెట్టడానికి రెడీ అయింది. ఆటోమేషన్, ఏఐలను దాటుకుని ఏకంగా రోబోలతో పని చేయించుకోవడానికి సిద్ధమైంది. దీంతో 75 శాతం పనిని ఆటోమేట్ చేవచ్చని అంచనా వేస్తోంది.

5లక్షల ఉద్యోగాలు..

అమెజాన్ ఆటోమేషన్ బృందం దీనిపై పని చేస్తోంది. నెమ్మదిగా మనుషుల స్థానంలో రోబోలను పనిలోకి తీసుకువస్తోంది. త్వరలోనే 5 లక్షల ఉద్యోగాలను అమెజాన్ రోబోలతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో దీన్ని మరింత పెంచుతుందని కూడా చెబుతున్నారు. 2027 నాటికి అమెరికాలో 1, 60,000 కంటే ఎక్కువ మందిని ఉద్యోగాలను తప్పించడం లేదా..నియమించకుండా ఉండేందుకు అమెజాన్ ఆటోమేషన్ బృందం పని చేస్తోంది. దీని వలన అమెజాన్ ఎంచుకునే, ప్యాకింగ్, డెలివరీ చేసే ప్రతి వస్తువుపై కంపెనీకి దాదాపు 30 సెంట్లు లేదా రూ. 26 ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2033 నాటికి దాదాపు 6లక్షల రోబోలు అమెజాన్‌లో పని చేస్తాయని చెబుతున్నారు. దాంతో  రెండింతలు ఎక్కువ ఉత్పత్తులను అమ్ముతామని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్ ఏడాదికి దాదాపు 1. బిలియన్ల మంది కార్మికులను నియమించుకుంటోంది. 

2012లో అమెజాన్ రోబోటిక్స్ తయారీ సంస్థ కివాను $775 మిలియన్లకు కొనుగోలు చేయడంతో రోబోటిక్ ఆటోమేషన్‌లోకి తొలిసారిగా ప్రవేశించింది. గత సంవత్సరం, కంపెనీ తన అత్యంత అధునాతన రోబో తయారీ గిడ్డంగిని ప్రారంభించింది. దీనిలో దాదాపు 1,000 రోబోలు మానవ ప్రమేయం లేకుండా ఒక ప్యాకేజీని ప్రాసెస్ చేస్తాయి.  

Also Read: Saudi: సౌదీలో కఫాలా వ్యవస్థ రద్దు..బానిసత్వం నుంచి బయటపడ్డ 25 లక్షల భారతీయ కార్మికులు


 

Advertisment
తాజా కథనాలు