Dia Mirza: HCU వివాదంపై రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్! అవి AI కాదు రియల్

గచ్చిబౌలి భూముల వివాదంలో CM రేవంత్ చేసిన ఆరోపణలపై నటి దియా మిర్జా రియాక్ట్ అయ్యారు. చెట్లు, వ్యన్యప్రాణులకు సంబంధించి ఫేక్ ఏఐ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని CM ఆరోపించడాన్ని ఖండించారు. ఆరోపణలు చేసేముందు వాస్తవాలను పరిశీలించాలని సీఎం కు కౌంటర్ ఇచ్చారు.

New Update
Dia Mirza counter to cm revanth reddy

Dia Mirza counter to cm revanth reddy

Dia Mirza:  కంచె గచ్చిబౌలి భూముల వివాదం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఈ వివాదంపై మాట్లాడుతూ.. భూముల వివాదానికి సంబంధించి ఫేక్ ఏఐ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పలువురు సినీ, రాజీకయ ప్రముఖులు కూడా ఏఐ వీడియోలను సర్య్కూలేట్ చేశారని మండిపడ్డారు. 

నటి దియా ట్వీట్ 

ఈ క్రమంలో తాజాగా నటి దియా మీర్జా రేవంత్ రెడ్డి ఆరోపణలపై రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ చెట్ల కటింగ్ వీడియోలు AI జనరేటెడ్, ఫేక్ అని చెప్పడాన్ని ఖండించారు. ఆరోపణలు చేసే ముందు వాస్తవాలను పరిశీలించాలని కౌంటర్ ఇచ్చారు. దియా తన ఎక్స్ లో ఇలా ట్వీట్ చేసింది.. "తెలంగాణ ముఖ్యమంత్రి కంచె గచ్చిబౌలి ఇష్యూ పై  కొన్ని ఆరోపణలు చేశారు. వాటిలో ముఖ్యమైనది ఏఐ జెనరేటెడ్ వీడియోలు, ఫొటోలు షేర్ చేశారని. కానీ అది పూర్తిగా అసత్యం.  ఇష్యూకి సంబంధించి నేను ఏ ఫేక్ వీడియోలు లేదా ఫొటోలు పోస్టు చేయలేదు. అవి పూర్తిగా ఒరిజినల్. తెలంగాణ ప్రభుత్వ అధికారుల ఇలాంటి వాదనలు చేసేముందు పరిశీలించాలని'' ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గచ్చిబౌలి భూమిపై ఏఐ జనరేటెడ్ వీడియోలపై  దర్యాప్తు కోసం కోర్టులో పిటిషన్ వేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.  

తెలంగాణ ప్రభుత్వం  డెవలప్మెంట్ పేరిట గచ్చిబౌలిలోని 400 ఎకరాలలో ఉన్న చెట్లు, అటవీ సంపదను తొలగించడంపై హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ప్రభత్వ  నిర్ణయంతో ఎన్నో జీరాశులు తమ నివాసాన్ని కోల్పోతున్నాయని, లక్షల సంఖ్యల్లో చెట్లు నేలమట్టం అవుతున్నాయని.. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ  నిరసనలు తెలియజేశారు. విద్యార్థులకు తోడుగా ప్రతిపక్ష నాయకులు, సెలెబ్రెటీలు కూడా ఈ వివాదం పై స్పందించారు. 

telugu-news | cinema-news | revanth-reddy | 400 acres hcu land issue

Also Read :  Fake Hair Growth : ఘరానా మోసగాడు.. బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ గుండ్లు కొట్టి పరార్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు