USA: అమెరికాలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న మీజిల్స్..ప్రయాణికులకు హెచ్చరికలు

అమెరికాలో మరో అంటు వ్యాధి విపరీతమైన వేగంతో వ్యాపిస్తోంది. ప్రస్తుతం హాలిడే సీజన్ కావడం, ప్రయాణాలు ఎక్కువగా ఉండడంతో మీజిల్స్ వైరస్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. 

New Update
measels

ప్రస్తుతం అమెరికాలో మీజిల్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అమెరికాలో హాలిడే సీజన్ నడుస్తోంది. జనవరి మొదటి వారం వరకు ఇక్కడ అందరికీ సెలవులు. దీంతో చాలా మంది ప్రయాణాలు చేస్తున్నారు. కొందరు అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తుంటే మరి కొందరు అమెరికాలోనే తెగ తిరిగేస్తున్నారు. ఈ క్రమంలో మీజిల్స్ వైరస్ కూడా తన పని తాను చేసుకుంటూ పోతోంది. చాలా తొందరగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ పోతోంది. రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎక్కువగా ఈ మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. న్యావార్క్ లిబర్టీ, బోస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు దీని బారిన పడ్డారు. గాలి ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. 

ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త..

అమెరికాలో డిసెంబర్ వచ్చిందంటే హాలిడే సీజన్ మొదలైపోతుంది. దాదాపు అందరికీ రెండు నుంచి మూడు వారాలు సెలవులు ఉంటాయి.దీంతో ఈ టైమ్ లోనే ఇక్కడి వారు అత్యంత ఎక్కుగా ప్రయానాలు చేస్తుంటారు. ఈ సారి కూడా దేశ వ్యాప్తంగా 8.03 మిలియన్ల మంది ప్రయాణాలు చేస్తారని అంచనాలున్నాయి.  న్యూజెర్సీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ (NJDOH) ప్రకారం, డిసెంబర్ 12న టెర్మినల్స్ B మరియు C ద్వారా ప్రయాణించిన ఒక ప్రయాణీకుడికి తట్టు వ్యాధి ఉన్నట్లు తరువాత నిర్ధారించబడింది. దీంతో అక్కడి అధికారులు వెంటనే హెచ్చరికలు జారీ చేశారు. CDC ప్రకారం, USలో ఇప్పటి వరకు  2,012 మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. అందుకే ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని అమెరికా హెల్త్ డిపార్ట్ మెంట్లు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. గాలి ద్వారానే ఈ మీజిల్స్ వైరస్ వ్యాపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వీలయితే తప్పనిసరిగా మీజిల్స్ వ్యాక్సిన్ వేయించుకోవాలని చెబుతున్నారు. 

మీజిల్స్ వైరస్...ఇదేమీ కొత్త వైరస్ కాదు. కానీ వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. దీన్నే తెలుగులో తట్టు వ్యాధి అని కూడా అంటారు. తట్టు అనేది అత్యంత అంటువ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థ, చర్మాన్ని ప్రభావితం చేస్తుంది.  అధిక జ్వరం, దగ్గు, ముక్కు కారడం, కళ్ళు ఎర్రబారడం, ముఖం మీద ప్రారంభమై మెడ, మొండెం, చేతులు, కాళ్ళు , పాదాల వరకు వ్యాపించే విలక్షణమైన ఎర్రటి దద్దుర్లు వంటి మీజిల్స్ లక్షణాలు. ఈ వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు గాలిలో వచ్చే బిందువుల ద్వారా సులభంగా వ్యాపిస్తుంది. అలాగే  రెండు గంటల వరకు గాలిలో ఉంటుంది. అయితే మీజిల్స్ కు వ్యాక్సిన్ ఉంది. 

Advertisment
తాజా కథనాలు