వామ్మో.. 24ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్న 74ఏళ్ల ముసలాయన

ఇండోనేషియాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 74 ఏళ్ల ముసలాయన 24 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. ఇందుకోసం ఆమెకు రూ.2 కోట్లు ఎదురుకట్నం (కన్యాశుల్కం) కూడా ఇచ్చాడు.

New Update
74-Year-Old Indonesian Man Pays 2 crores To Woman, 24, For Marriage

74-Year-Old Indonesian Man Pays 2 crores To Woman, 24, For Marriage

ఇండోనేషియాలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 74 ఏళ్ల ముసలాయన 24 ఏళ్ల యువతిని వివాహం చేసుకున్నాడు. ఇందుకోసం ఆమెకు రూ.2 కోట్లు ఎదురుకట్నం (కన్యాశుల్కం) కూడా ఇచ్చాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 2న తూర్పు జావా ప్రావిన్స్‌లోని పాసిటన్ రీజెన్సీలో టార్మాన్ (74) అనే వృద్ధుడు 24 ఏళ్ల అరికా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. రూ.2 కోట్లు ఎదురుకట్నం ఇచ్చి ఈ పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహ వేడుక తర్వాత ఫొటోగ్రాఫర్లకు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకున్నాడు.

Also Read: ట్రంప్ అధ్యక్ష పదవికి గండం? వ్యతిరేకంగా లక్షల మంది రోడ్లపైకి..

దీంతో ఆ ఫొటోగ్రాఫర్లకు చెందిన సంస్థ  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం.. వధువుకు ముందుగా రూ.60 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ పెళ్లి వేడుక సమయంలో రూ.1.8 కోట్లు చెల్లించారు. పెళ్లికి వచ్చిన గెస్టులకు కూడా రిటర్న్ గిఫ్టులుగా కొంత డబ్బులు కూడా ఇచ్చారు. పెళ్లి ముగిసిన కాసేపటి ఆ దంపతులు కనిపించకుండా పోయారు. వాళ్లకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. 

Also Read: ఇస్రోకు చంద్రయాన్‌-2 నుంచి కీలక సమాచారం.. చంద్రుడిపై సూర్యుడి ప్రభావం..!

దీంతో ఆ పెళ్లి  వేడుక వివాదాస్పదమైంది. పెళ్లి వద్దని ఆ యువతిని మేము హెచ్చరించామని వధువు తరఫు బంధువులు ఓ మీడియా సంస్థతో తెలిపారు. కానీ ఆమె తమ మాటలు పట్టించుకోలేదని చెప్పారు. ఆ తర్వాత ఆ దంపతులు విడిపోయినట్లు కూడా ప్రచారం జరిగింది. చివరికి తమ వివాహంపై వస్తున్న వార్తలపై టార్మాన్ స్పందించారు. వధువుకు డబ్బు చెల్లించిన విషయం నిజమేనన్నారు. కానీ తాము విడిపోయారని వస్తున్న వార్తలను ఖండించారు. మరోవైపు ఫొటోగ్రఫర్లు చేసిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు