/rtv/media/media_files/2025/03/07/jx8pE61H9brqZHfoj9yD.jpg)
Tahawwur Rana Photograph: (Tahawwur Rana)
తనను భారత్ కు అప్పగించొద్దు మొర్రో అంటూ మొత్తుకున్నాడు. భారత్ కు తనను పంపిస్తే చిత్ర హింసలకు గురి చేస్తారని ఏడ్చాడు. కానీ అమెరికాలో సుప్రీంకోర్టుతో సహా ఏ న్యాయస్థానం అతని మాటను వినలేదు. చిట్టచివరి పిటిషన్ కూడా నిన్న తిరస్కరణకు గురైంది. దీంతో అక్కడి అధికారులు రాణాను భారతీయ అధికారులకు అప్పగించారు. చట్టపరమైన లాంఛనాలన్నింటినీ పూర్తి చేసుకుని తహవూర్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు అతనిని తీసుకుని అధికారుల బృందం ప్రత్యేక విమానంలో ఇండియాకు తిరుగుపయనమైందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పలు ఇంగ్లీష్ న్యూస్ లలో కథనాలు వచ్చాయి. ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారు ఝాముకు వారు ఇండియా చేరుకోనున్నారు.
ఎప్పటి నుంచో పోరాడుతున్న భారత్..
తహవూర్ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ఇతన్ని అప్పగించాలని భారత్ చాలాకాలంగా పోరాడుతోంది. అయితే దీన్ని తహవూర్ రాణా చాలా సార్లు ప్రయత్నించాడు. అక్కడి ఫెడరల్ కోర్టుల్లో చాలా సార్లు పిటిషన్ వేశాడు. ఆ కోర్టులన్నీ అతని అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది. దీంతో చివరిసారి గా గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు తహవూర్ రాణా. అయితే ఈ పిటిషన్ ను కట్టేయాలని కోర్టును అమెరికా ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించి 20 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు అమెరికా ప్రభుత్వం అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంది. రాణా పిటిషన్ ను కొట్టేసింది. తాజాగా నిన్న మరో న్యాయస్థానం కూడా అతని పిటిషన్ ను తిరస్కరించింది. వీటన్నిటితో పాటూ రాణా అప్పగింతపై అధ్యక్షుడు ట్రంప్ సైతం ప్రకటన చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు వెళ్ళినప్పుడు 26/11 ముంబయి ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ కు అప్పగిస్తామని మాటిచ్చారు.
today-latest-news-in-telugu | Tahawwur Rana | india
Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు