Nepal protest: పోలీసుల కాల్పుల్లో 16 మంది మృతి.. రంగంలోకి ఆర్మీ

నేపాల్‌లో పరిస్థితి అదుపుతప్పింది. సోషల్ మీడియా నిషేధంపై యువత నిరసనకు దిగగా.. పోలీసులు వారికి అదుపు చేయడానికి రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లు చనిపోయిన వారి సంఖ్య 16కి చేరింది. దీంతో నేపాల్‌లో ఆందోళనలు తీవ్ర హింసకు దారితీశాయి.

New Update
Kathmandu

Kathmandu

నేపాల్‌లో పరిస్థితి అదుపుతప్పింది. సోషల్ మీడియా నిషేధంపై యువత నిరసనకు దిగగా.. పోలీసులు వారికి అదుపు చేయడానికి రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లు చనిపోయిన వారి సంఖ్య 16కి చేరింది. దీంతో నేపాల్‌లో ఆందోళనలు తీవ్ర హింసకు దారితీశాయి. రాజధాని ఖాట్మండులో ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 100 మందికి పైగా గాయపడ్డారని అధికారిక వర్గాల నుంచి అందిన సమాచారం.

నిరసనకారులు, ముఖ్యంగా యువత సోషల్ మీడియా నిషేధం, ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్లమెంట్ భవనం వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లను ప్రయోగించారు. అయితే, పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లు, ఆ తర్వాత లైవ్ బుల్లెట్లను ఉపయోగించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఖాట్మండులోని ట్రౌమా సెంటర్, సివిల్ ఆసుపత్రి, ఎవరెస్ట్ ఆసుపత్రులలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఖాట్మండులోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని కూడా మోహరించింది. ఈ ఘటనలపై ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. సోషల్ మీడియా నిషేధాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని, హింసకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisment
తాజా కథనాలు