RGV: రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్.. వ్యూహం సినిమాకు చెక్ పెట్టిన కోర్టు..

డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చింది సివిల్ కోర్టు. వ్యూహం సినిమా విడుదలపై స్టే విధించింది. ఓటీటీ సహా ఎలాంటి ప్లాట్‌ఫామ్‌లోనూ సినిమా విడుదల చేయకూడదని ఆదేశించింది. లోకేష్ వేసి పిటిషన్‌ మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

New Update
RGV: రాంగోపాల్ వర్మకు బిగ్ షాక్.. వ్యూహం సినిమాకు చెక్ పెట్టిన కోర్టు..

Ram Gopal Varma: దర్శకుడు రాంగోపాల్ వర్మకు షాక్ ఇచ్చింది సివిల్ కోర్ట్. ఆర్జీవీ తీసిన 'వ్యూహం' సినిమాను ఓటీటీ, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేస్తూ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహం సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. సినిమా విడుదలపై స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీకి విచారణను వాయిదా వేసింది కోర్టు.

ఇదిలాఉంటే.. రాంగోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలో చాలా వరకు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు, టీడీపీ ప్రతిష్టను దెబ్బతీసేలా.. రాజకీయ ఎజెండాతో వ్యూహం సినిమాను రూపొందించారని, దీనిని అడ్డుకోవాలని పిటిషన్‌లో కోరారు లోకేష్. ఈ రిట్ పిటీషన్ పై ఈ నెల 26 న తెలంగాణ హైకోర్ట్ లో విచారణ జరుగనుంది. ఇంతలోనే సివిల్ కోర్టు వ్యూహం సినిమా విడుదలపై స్టే విధించింది.

Also Read:

వ్యూహం సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేష్..

కరీంనగర్ ప్రజలకు శుభవార్త.. ఇక వారానికి 4 రోజులు..

Advertisment
తాజా కథనాలు