Vyooham Movie: వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాపై హైకోర్టును ఆశ్రయించారు టీడీపీ నేత నారా లోకేష్. తెలంగాణ హైకోర్టులో దీనిపై పిటిషన్ వేసిన ఆయన.. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్ డిసెంబర్ 26న విచారణకు రానుంది. రాంగోపాల్ వర్మ ఇష్టమొచ్చినట్లు సినిమా తీశారని ఆరోపించారు. ఆర్జీవీ తన ఇష్టాఇష్టాలతో పాత్రలను నిర్ణయించుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. వ్యూహం సినిమాలో చంద్రబాబును తప్పుగా చూపించారని, ట్రైలర్ మాదిరిగానే సినిమా అంతా ఉండే అవకాశం ఉందన్నారు.
పూర్తిగా చదవండి..Vyooham Movie: వ్యూహం సినిమాపై హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేష్..
వ్యూహం సినిమాపై హైకోర్టును ఆశ్రయించారు నారా లోకేష్. ఆ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు, టీడీపీని దెబ్బతీసే కుట్రలో భాగంగానే వ్యూహం సినిమా తీశారని ఆరోపించారు లోకేష్. సినిమాను అడ్డుకోవాలని పిటిషన్లో కోరారు.
Translate this News: