PM Kisan In Budget : రైతులకు బడ్జెట్‌లో తీపి కబురు.. పీఎం కిసాన్‌ పెంపు? ఎంతంటే?

ఫిబ్రవరి 1న(ఇవాళ్టి) మధ్యంతర బడ్జెట్‌పై అనేక అంచనాలు ఉన్నాయి. రైతులు పీఎం-కిసాన్ కింద పొందే మొత్తాన్ని పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.6వేలు ఇస్తుండగా, ఏడాదికి రూ.9వేలకు పెంచవచ్చని సమాచారం.

New Update
PM Kisan In Budget : రైతులకు బడ్జెట్‌లో తీపి కబురు.. పీఎం కిసాన్‌ పెంపు? ఎంతంటే?

Union Budget 2024 : రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM-Kisan Samman Nidhi) ను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు డబ్బులు ఇస్తారు. ఈ పథకం కింద, అర్హులైన రైతులకు సంవత్సరానికి మూడుసార్లు రూ. 2,000 అందజేస్తారు, అంటే రైతులకు ఏటా రూ.6,000 ప్రయోజనం అందిస్తారు. కోట్లాది మంది రైతులు ఇప్పటికే ఈ పథకంతో అనుబంధం కలిగి ఉన్నారు.. వారంతా ప్రయోజనాలు పొందుతున్నారు. ఇక ఇవాళ(ఫిబ్రవరి 1న) జరగనున్న మధ్యంతర బడ్జెట్‌(Interim Budget) లో కేంద్రం రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పనుందన్న ప్రచారం జరుగుతోంది.

రూ.3వేలు పెంపు?
సార్వత్రిక ఎన్నికలకు ముందు సమర్పిస్తోన్న చివరి బడ్జెట్ కావడంతో దేశంలోని ప్రతి వర్గానికి ఈ మధ్యంతర బడ్జెట్‌పై కొన్ని అంచనాలు ఉన్నాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో రైతులు(Farmers), మహిళలు(Women's), యువత(Youth) కు పెద్దపీట వేయవచ్చని భావిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు కూడా పన్ను మినహాయింపు కోసం ఎదురు చూస్తున్నారు. దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు ఈ బడ్జెట్‌లో అనేక భారీ ప్రకటనలు చేయవచ్చని భావిస్తున్నారు. రైతులకు ఉపశమనం కల్పించడమే కాకుండా ఉపాధికి సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలు చేయవచ్చు.

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం తన డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) కింద పొందే మొత్తాన్ని పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.6వేలు ఇస్తుండగా, ఏడాదికి రూ.9వేలకు పెంచవచ్చు. ఇది కాకుండా, ఉపాధి అవకాశాలను పెంచడానికి కొన్ని ప్రకటనలు ఉండవచ్చు. ఈ స్టెప్‌ ద్వారా ఎక్కువ మంది యువ ఓటర్లను ఆకర్షించవచ్చు. ఈ రెండు చర్యలతో ప్రభుత్వం ఏకకాలంలో రైతులు, యువతను ఆకర్షించగలదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: కమ్మేస్తోన్న యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై దాడి చేయాలని బైడెన్‌పై పెరుగుతోన్న ఒత్తిడి!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు