Budget 2024 : బడ్జెట్ లో ఉపయోగించే ఈ పదాల అర్ధం తెలుసుకోండి
మరో మూడురోజుల్లో బడ్జెట్ రానుంది. బడ్జెట్ లో ఉపయోగించే కొన్ని పదాలకు అర్ధాలు మనలో చాలామందికి తెలియవు. వాటిలో ముఖ్యమైన 10 పదాల అర్ధాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.
మరో మూడురోజుల్లో బడ్జెట్ రానుంది. బడ్జెట్ లో ఉపయోగించే కొన్ని పదాలకు అర్ధాలు మనలో చాలామందికి తెలియవు. వాటిలో ముఖ్యమైన 10 పదాల అర్ధాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.
బడ్జెట్(2024)లో ఆదాయపు పన్ను మినహాయింపుపై ప్రజలకు చాలా తక్కువ ఆశలు ఉన్నాయని కేర్ రేటింగ్ సర్వే చెబుతోంది . ఈ అంశంపై 120 మంది ప్రముఖుల నుంచి అభిప్రాయాన్ని కోరింది సంస్థ. పన్ను మినహాయింపు ఇచ్చే ఛాన్స్ లేదని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు.
మధ్యంతర బడ్జెట్లో ప్రజలను ఆకర్షించే పథకాలను పెట్టాలని కేంద్రం నిర్ణయించుకుంది. పీఎం కిసాన్ సాయం పెంచనుందని ప్రచారం జరుగుతోంది. యువతను ఆకట్టుకునేందుకు స్టార్టప్ రంగానికి పన్ను మినహాయింపులు ప్రకటించే ఛాన్స్ ఉంది. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో ప్రధాన్యత ఇవ్వనుంది కేంద్రం.
నేడు పార్లమెంట్లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న ఈ మధ్యంతర బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా లీటర్‌పై రూ. 5 నుంచి రూ.10 వరకు పెట్రోల్ ధర తగ్గించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఆర్థిక మంత్రి నిర్మల ఫిబ్రవరి 1న వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి కూడా బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో బడ్జెట్ గురించి నెట్టింట్లో సేర్చ్ చేస్తున్నారు. బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాల కోసం మొత్తం ఆర్టికల్‌ను చదవండి.
ఫిబ్రవరి 1న(ఇవాళ్టి) మధ్యంతర బడ్జెట్‌పై అనేక అంచనాలు ఉన్నాయి. రైతులు పీఎం-కిసాన్ కింద పొందే మొత్తాన్ని పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.6వేలు ఇస్తుండగా, ఏడాదికి రూ.9వేలకు పెంచవచ్చని సమాచారం.
మన దేశ బడ్జెట్ ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశ పెట్టే విధానం 2017లో మోడీ సర్కార్ తీసుకు వచ్చింది. అంతకుముందు ఫిబ్రవరి నెలాఖరు-మార్చి మొదటి వారంలో బడ్జెట్ తీసుకువచ్చేవారు. ఫిబ్రవరి1న బడ్జెట్ పెడితే, దానిలోని అంశాలు ఏప్రిల్ నుంచి అమలు చేయడానికి అవకాశం దొరుకుతుంది.
స్వతంత్ర భారత్‌లో మొట్టమొదటి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఘనత షణ్ముఖం శెట్టికి దక్కుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన మూడు నెలల తర్వాత 26 నవంబర్ 1947న ప్రవేశపెట్టారు. దేశ తొలి బడ్జెట్లో మొత్తం ఆదాయం రూ.171.15 కోట్లు, రూ. 197.29 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
గత బడ్జెట్ లో పన్నుల విధానం దగ్గర నుంచి.. రైతుల కోసం ప్రత్యేక పథకాల వరకూ కానుకలు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మరికొన్ని గంటల్లో బడ్జెట్ రానున్న సందర్భంలో ఆ వివరాలతో పాటు బడ్జెట్ లో ఏ కానుకలు రావచ్చనే అంచనాలు కూడా ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.