SA vs IND : ఆ ఒక్కడిపై ఆధారపడితే ఫలితాలు దక్కవు.. తొలి టెస్టు ఓటమిపై రోహిత్ సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు ఓటమిపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడింది. మా బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. బుమ్రా ఒక్కడిపై ఆధారపడితే ఆశించిన ఫలితాలు దక్కవు అన్నారు. By srinivas 29 Dec 2023 in Latest News In Telugu Uncategorized New Update షేర్ చేయండి SA vs IND : దక్షిణాఫ్రికాతో (South Africa) జరిగిన తొలి టెస్టు ఓటమిపై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్(Rohith) శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సౌత్ ఆఫ్రికా రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ జట్టు విజయం కోసం ఏ ఒక్కరిపైనే ఆధారపడితే విజయాలు దక్కవని చెప్పారు. ఈ మేరకు ‘దక్షిణాఫ్రికా అద్భుతంగా ఆడింది. అయితే మా బౌలర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. ఇది 400 పరుగులు చేసే పిచ్ కాదు. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ మేము బుమ్రాపైనే ఎక్కువ ఆధారపడితే ఫలితం అనుకున్నట్లు రాదు. అతనికి మిగతా బౌలర్లనుంచి మద్దతు కావాలి. మరో ముగ్గురు పేసర్లూ మరింత రాణించాల్సివుంది. నాణ్యమైన బౌలర్. ఈ ఓటమి నుంచి తప్పకుండా పాఠం నేర్చుకుంటాం. ఆటలో జయపాజయాలు కామన్. రెండో టెస్టుకు అన్ని రకాలుగా రెడీ అవుతున్నాం. గాయాల బాధ ఇబ్బంది పెడుతున్నప్పటికీ అత్యుత్తమ ఆటగాళ్లనే ఎంపిక చేసుకున్నాం. ప్రసిధ్ కృష్ణ ఇప్పుడే టెస్టుల్లోకి ఇప్పుడే అరంగేట్రం చేశాడు. భవిష్యత్తులో రాణిస్తాడనే నమ్మకం ఉంది. తన ఆటకు పదునుపెట్టాలి. దక్షిణాఫ్రికా జట్టులోనూ గెరాల్డ్, బర్గర్, జాన్‌సెన్ పేసర్లకు రెడ్‌బాల్ క్రికెట్ అనుభవం లేదు. అయినా పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని రాణించారు. అందుకే, ఎప్పుడు అవకాశం వచ్చినా అత్యుత్తమంగా రాణించేందుకు శ్రమించాలి. ఒక్కోసారి ఎంత శ్రమించినా తొలి మ్యాచ్‌లో నాణ్యమైన ప్రదర్శన చేయలేకపోవచ్చు. మేం కంగారు పడితే.. కొత్త బౌలర్ ఇంకా ఆందోళనకు గురవుతాడు. కెరీర్ ఆరంభంలో ఇలాంటి అనుభవం సర్వసాధారణం' అన్నారు. ఇది కూడా చదవండి : SKM : మోడీ సర్కార్ కు ‘ఎస్‌కేఎం’ షాక్.. 500 జిల్లాల్లో ట్రాక్టర్ పరేడ్! అలాగే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భారత బ్యాటింగ్ దారుణంగా ఉందని, ఇలాంటి పిచ్‌లపై ఎలా ఆడాలో కేఎల్ రాహుల్ చూపించాడని చెప్పాడు. ఇదిలావుంటే ఈ ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ మూడో సీజన్ పట్టికలోనూ దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకోగా టీమ్‌ఇండియా ఐదో స్థానానికి పడిపోయింది. #india #rohith-sarma #south-africa #test-match మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి