Telangana : పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చాయని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయనే కారణంతో వరంగల్‌ జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో అర్షియ(17) అనే బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. నాకు చదివింది గుర్తు ఉండటం లేదని.. నా వల్ల కాదు ఇగ అంటూ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది.

New Update
Telangana : పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చాయని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

Warangal : వరంగల్(Warangal) జిల్లా కురవి మండలం నేరడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్‌(Inter) లో మార్కులు తక్కువొచ్చాయనే కారణంతో షేక్ అర్షియ(Shaik Arshiya) (17) అనే బాలిక బావిలో దూకి ఆత్మహత్య(Suicide) చేసుకుంది. వరంగల్‌ నగరంలోని ఓ మైనార్టీ కళాశాలలో అర్షియ ఇంటర్‌ చదవుతుంది. ఇటీవల వాళ్ల కాలేజీలో నిర్వహించిన ఇంటర్నల్‌ పరీక్షల్లో ఆమె ఫెయిలయ్యింది(Fail). దీంతో మనస్తాపం చెందిన అర్షియ బలవన్మరణానికి పాల్పడింది. నాకు చదివింది గుర్తు ఉండటం లేదని.. నా వల్ల కాదు ఇంక అంటూ ఆత్మహత్య చేసుకునేముందు అర్షియ ఓ సూసైడ్‌ నోట్ కూడా రాసింది.

publive-image

Also Read: హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో దారుణం..ఇద్దరు బాలికలపై దాడి

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది విద్యార్థులు మార్కులు తక్కువగా వచ్చాయనే.. పరీక్షల్లో ఫెయిలయ్యామనో మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లలకు జీవతంపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు వీటి పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది.

publive-image

Also Read: అయోధ్యలో భారీ భత్రత.. ముగ్గురు అనుమానితులు అరెస్టు..

Advertisment
తాజా కథనాలు