Ayodhya Ram Mandir : అయోధ్యలో భారీ భద్రత.. ముగ్గురు అనుమానితులు అరెస్టు.. ఈ నెల 22న బాలురాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న వేళ.. అయోధ్య జిల్లాలో ముగ్గురు అనుమానితులను యూపీ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ గ్రూప్‌నకు చెందినవారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. By B Aravind 19 Jan 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ram Lalla : అయోధ్య(Ayodhya) లో రామ్‌లల్లా(Ram Lalla) ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుతున్నాయి. ఇప్పటికే బాలరాముడు ఆలయంలోని గర్భగుడికి చేరుకున్నారు. జనవరి 22న జరిగే ఆలయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ(PM Modi) తో సహా వేలాదిమంది రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే అయేధ్య అంతటా ఆధ్యాత్మక శోభ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ(UP) ప్రభుత్వం భారీ భద్రతను మోహరించింది. రామమందిరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 10 వేల మందికి పైగా భద్రత సిబ్బంది అయోధ్యలో విధులు Also Read: యువతకు మీరు ఆదర్శం..తెలంగాణ రైతుకు ప్రధాని మోడీ ప్రశంసలు ఏ గ్రూప్‌కు చెందినవారు ? ఇక అయోధ్య జిల్లాలో ముగ్గురు అనుమానితులను యూపీ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్(ATS) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయోధ్య జిల్లాలో పోలీసులు కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు అనుమానితులను ఎస్‌ఏటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఉత్తర్‌ప్రదేశ్ స్పెషల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అయితే పట్టుబడ్డ ఈ ముగ్గురు అనుమానితులు ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ గ్రూప్‌నకు చెందినవారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు. 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలు ఇదిలా ఉండగా.. ఇప్పటికే అయోధ్యలో నగరవ్యాప్తంగా 10 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాట్లు. డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేసింది. రామాలయ గర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహాన్ని కూడా చేర్చారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటక(Karnataka) కు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్వి 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని రూపొందించాడు. ఈ విగ్రహం బుధవారం రాత్రి అయోధ్యకు చేరింది. అనంతరం క్రేన్ సాయంతో దాన్ని ఆలయ ప్రాంగణంలోకి చేర్చారు. ఆ తర్వతా గర్భగుడిలోకి తీసుకొచ్చారు. Also Read: సలార్ ఓటీటీ డేట్ వచ్చేసిందోచ్… #uttar-pradesh #ayodhya #ram-mandir #ram-lalla #national-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి