Bullet Train: దేశంలో బుల్లెట్‌ ట్రైన్‌ పట్టాలెక్కేది అప్పుడే: అశ్వినీ వైష్ణవ్

దేశంలో మొదటి బుల్లెట్ రైలు 2026 నాటికి పట్టాలెక్కుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మొదటగా గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడుపుతామని.. 2028 నాటికి ముంబయి నుంచి అహ్మదాబాద్‌ వరకు నడిపిస్తామని చెప్పారు.

Bullet Train: దేశంలో బుల్లెట్‌ ట్రైన్‌ పట్టాలెక్కేది అప్పుడే: అశ్వినీ వైష్ణవ్
New Update

బుల్లెట్‌ రైలులో ప్రయాణం అంటే గమ్యస్థానానికి అతివేగంగా వెళ్లిపోవచ్చు. ఇప్పటికే పలు అభివృద్ధి చెందిన దేశాల్లో బుల్లెట్‌ రైళ్లు నడుస్తున్నాయి. అయితో ఇండియా కూడా బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా రాబోయే బుల్లెట్‌ రైలు కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొదటి బుల్లెట్ రైలు 2026 నాటికి పట్టాలెక్కుతుందని ప్రకటించారు. రైజింగ్‌ భారత్‌ సమ్మి్ట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్

2026 నాటికి పట్టాలెక్కుతుంది

'బుల్లెట్‌ రైలు కోసం 500 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టును నిర్మించేందుకు పలు దేశాలకు సుమారప 20 ఏళ్లు పట్టింది. ఇండియా మాత్రం ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 8-10 ఏళ్లలో పూర్తి చేయనుంది. 2026 నాటికి బుల్లెట్‌ రైలు పట్టాలెక్కుతుంది. మొదటగా గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు దీన్ని నడపనున్నాం. ఆ తర్వాత 2028 నాటికి ముంబయి నుంచి అహ్మదాబాద్‌ వరకు పూర్తి మార్గం అందుబాటులోకి వస్తుందని' మంత్రి తెలిపారు.

అతివేగంగా ప్రయాణం

ఇదిలాఉండగా.. మొదట బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడర్ పొడవు మొత్తం 508.17 కిలో మీటర్లు. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు 251 కిలోమీటర్ల వరకు పిల్లర్లు, 103 కి.మీ వరకు ఎలివేటెడ్ స్ట్రక్చర్‌ నిర్మాణం జరిగినట్లు గతంలోనే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి వస్తే.. కేవలం 2.58 గంటల్లోనే అహ్మదాబాద్ నుంచి ముంబయికి చేరుకోవచ్చు. అయితే ఈ రైలు మార్గం ముంబయి, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది. ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తైనట్లు తెలుస్తోంది. అలాగే ముంబయి, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు చివరి దశకు చేరినట్లు సమాచారం. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వచ్చాక.. ఇక ప్రయాణికుల ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యవంతంగా ఉండనుంది.

Also Read: రూ.100 కోట్లు కాదు.. రూ.600 కోట్ల స్కామ్: ఈడీ

#bullet-train-project #ashwini-vaishnav #bullet-train #national-news #telugu-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి