Budget For Maldives:నిన్న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం మాల్దీవులకు ఆర్ధిక సాయం కింద రూ.600 కోట్లు ప్రకటించింది. పొరుగు దేశాలతో బంధాలను బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు కేటియించినది 50వాతం తక్కువ. 2023 బడ్జెట్‌లో మాల్దీవుల అభివృద్ధికి రూ.400కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దాదాపు రూ. 770కోట్లు ఖర్చు పెట్టింది. సవరించిన అంచనాల ప్రకారం ఇంత ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దాంతో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన అమౌంట్ 22 శాతం తగ్గింది.
Also read:Telangana: ఈ రోజే ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణ సభ
పొరుగు దేశాలకు ప్రాధాన్యం...
ఈ సారి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కేవలం మాల్దీవులకే కాదు మిగతా పక్క దేశాలకు కూడా కేటాయింపులు చేసింది. విదేశీ వ్యవరాల మంత్రిత్వశాఖకు రూ. 22,154 కోట్ల మొత్తాన్ని కేటాయించారు. కేంద్రం అనుసరిస్తున్న పొరుగకే ప్రాధాన్యం పాలసీకి అనుగుణంగా మరో సరిహద్దు దేశమైన భూటాన్‌కు రూ. 2, 068 కోట్లు..నేపాల్‌కు రూ. 700 కోట్లు...ఆఫ్ఘనిస్తాన్‌కు రూ. 200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ.120 కోట్లు కేటాయించారు. ఇక ఇరాన్‌తో అనుసంధానమైన ప్రాజెక్టుల కోసం, ఆ దేశంలో తలపెట్టిన చాబహార్ పోర్టు నిర్వహణకు రూ.100కోట్లను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
మధ్యంతర బడ్జెట్...
ఇక నిన్న పార్లమెంటులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ (BJP) ప్రభుత్వంలో ఇదే చివరి బడ్జెట్. అయితే ఈ బడ్జెట్ మొత్తం రూ.47.77 లక్షల కోట్లు కాగా.. పలు మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ప్రధాని మోదీ (PM Modi) హయాంలోనే 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందని నిర్మలా సీతారామన్ అన్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ మంత్రంతో ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పారు.