Telangana: ఈ రోజే ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణ సభ ఇంద్రవెల్లి వేదికగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ సభ నుంచి మరో మూడు గ్యారంటీల అమలు దిశగా ఆయన ప్రకటన చేసే అవకాశముంది. By Manogna alamuru 02 Feb 2024 in Latest News In Telugu ఆదిలాబాద్ New Update షేర్ చేయండి CM Revanth Reddy - Indravelli Meeting: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి నేడు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో పాల్టొంటున్నారు. ఇంద్రవెల్లిలో ఈ సభ జరగనుంది. అక్కడి నుంచే పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ సభ కోసం పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భారీగా జనసమీకరణ కూడా చేస్తున్నారని సమాచారం. ఎన్నికల శంకారావం పూరించడంతో పాటూ ఈ సభలోనే మరో మూడు గ్యారంటీల (Congress 6 Guarantees) అమలు గురించి కూడా ప్రకటచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. Also Read: Jharkhand: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం! రేవంత్ రెడ్డి ఇవాళ మొత్తం షెడ్యూల్.. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఆ తరువాత ఆలయ గోపురం, ఇతర అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడే స్వయం సహాయక సంఘాల మహిళలతో సీఎం ముఖాముఖి చేయనున్నారు. దాంతో పాటూ స్వయం సహాయక సంఘాల మహిళలకు చెక్కులను పంపిణీ కూడా చేయనున్నారు. తరువాత అక్కడి నుంచి ఇంద్రవెల్లి చేరుకుంటారు రేవంత్ రెడ్డి. అక్కడ ముందుగా అమరుల స్థూపానికి నివాళులు అర్పించి... స్మృతి వనం అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలకు ఇంటి స్థలం పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల సాంక్షన్ పత్రాలను పంపిణీ చేస్తారు. వాటితో పాటూ గిరిజన సంక్షేమ రహదారులతో పాటు పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం శంఖుస్థాపన చేయనున్నారు. అనంతరం తెలంగాణ పునర్నిర్మాణ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడతారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంద్రవెల్లి రేవంత్ రెడ్డి సెంటిమెంట్... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి గడ్డను సెంటిమెంట్‌గా తీసుకున్నారు. ఇంతకు ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించబడిన తర్వాత కూడా 2021లో ఇక్కడ నుంచే మొదటి సభను నిర్వహించారు. అప్పుడు దళిత, గిరిజన దండోరా పేరిటి నిర్వహించిన సభకు లక్ష మందికి పైగా జనం వచ్చారు. అప్పటి నుంచే రేవంత్ రెడ్డి దూసుకుపోయారు. అందుకే ఇంద్రవెల్లి అంటే ఆయనకు ఒక సెంటిమెంట్. అందుకే ఇప్పుడు కూడా అక్కడ నుంచే మొదటి భారీ బహిరంగ సభ నిర్వహించాలని అనుకున్నారు. ఇక మరోవైపు పార్లమెంటు ఎన్నికలను సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించినప్పటికీ...పార్లమెంటులో కూగా గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారు. #elections #cm-revanth-reddy #telangana #congress-guarantees #indravelli #parliament మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి