India Vs south Africa: బెంగళూరులో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 50 ఓవర్లు ఆడి 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు మాత్రమే చేసింది. మొదట బ్యాటంఇగ్ కు దిగిన టీమ్ ఇండియా పది ఓవర్ల వరకు అసలు వికెట్ కోల్పోకుండా నెమ్మదిగా ఆడింది. 12వ ఓవర్‌లో షఫాలీ వర్మ ఆవుట్ అయింది. కానీ మొదటి డౌన్‌లో దిగిన స్మృతి మంథాన మాత్రం నిలకడగా ఆడుతూ డేలాన్ హేమలతతో కలిసి స్కోరును 100కు చేర్చింది. తర్వాత డేలాన్ వికెట్ పడినా స్మృతి మంథాన, కెప్టెన్ హర్మత్ ఫ్రీత్ కౌర్‌లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత్ 325 స్కోరు చేసింది.
తరువాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఆఫ్రికా మొదట్లోనే తడబడింది. మొదటి నుంచి నెమ్మదిగా ఆడింది. దానికి తోడు 15వ ఓవర్‌లో 67 పరుగుల దగ్గర మూడు వికెట్లు కోల్పోయింది. తర్వాత లారా వోల్‌వార్ట్‌తో కలిసి మారిజానే కాప్ చెలరేగడంతో నాలుగో వికెట్‌కు 184 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈక్రమంలో మారిజానే తన సెంచరీ పూర్తి చేసింది. వోల్వార్డ్ సైతం సెంచరీ చేసింది. అయితే అంత కష్టపడి ఆడినా టీమ్ ఇండియా లక్ష్యానికి చేరుకోవాలంటే ఇంకా 11 రన్స్ చేయాల్సి ఉంది.
అది కూడా ఒక ఓవర్‌లో. పూజా వస్త్రాకర్ మొదటి 2 బంతుల్లో 5 పరుగులు ఇచ్చినా మూడో బంతికి నాడిన్ డి క్లెర్క్ (28), నాలుగో బంతికి నొందుమిసో షాంగ్సే (0)ను అవుట్ చేసింది. ఐదో బంతికి 1 రన్ వచ్చింది.. ఇక, చివరి బంతికి 5 పరుగులు అవసరం ఉన్న సమయంలో దాన్ని పూజా డాట్ బాల్ వేయడంతో దక్షిణాఫ్రికా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక, వోల్వార్ట్ 135 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ తరఫున పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ తలో రెండు వికెట్లు తీశారు.
Also Read:Starlink: ఎలాన్ మస్క్ స్టార్ లింక్‌తో ఓజోన్ పొరకు ప్రమాదం