ఇజ్రాయెల్ – హమాస్ మధ్య ఘర్షణలు మళ్లీ ముదురుతున్నాయి. ఐక్యరాజ్యసమితితో కలిసి.. గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతి చెందడం కలకలం రేపింది. మృతుడు ఐరాసలోని భద్రత, రక్షణ విభాగంలో(DSS) పనిచేస్తున్నారు. రఫాలోని యూరోపియన్ ఆసుపత్రికి వెళ్తుండగా.. ఆయన వాహనంపై దాడి జరిగింది. ఈ ఘటనలో మరో డీఎస్ఎస్ సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఐరాసలో పనిచేస్తున్న అంతర్జాతీయ సిబ్బందిలో జరిగిన తొలి మరణం ఇదే.
పూర్తిగా చదవండి..Israel-Hamas: గాజాలో విషాదం.. ఐరాసతో కలిసి పనిచేస్తున్న భారతీయుడు మృతి
ఐక్యరాజ్యసమితితో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతి చెందారు. మృతుడు ఐరాసలోని భద్రత, రక్షణ విభాగంలో(DSS) పనిచేస్తున్నారు. రఫాలోని యూరోపియన్ ఆసుపత్రికి వెళ్తుండగా.. ఆయన వాహనంపై దాడి జరిగింది.
Translate this News: