మరికొన్నిరోజుల్లో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక కోసం మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సోమవారం నాటికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా.. 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మే 27 ఈ పట్టభద్రుల ఎన్నిక జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలు బ్యాలేట్ పేపర్ ద్వారా జరగనున్నాయి. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో 4.63 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక జూన్ 5న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
పూర్తిగా చదవండి..Telangana: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా.. 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మే 27 ఈ పట్టభద్రుల ఎన్నికల జరగనుంది.
Translate this News: