Israel-Hamas: గాజాలో విషాదం.. ఐరాసతో కలిసి పనిచేస్తున్న భారతీయుడు మృతి ఐక్యరాజ్యసమితితో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతి చెందారు. మృతుడు ఐరాసలోని భద్రత, రక్షణ విభాగంలో(DSS) పనిచేస్తున్నారు. రఫాలోని యూరోపియన్ ఆసుపత్రికి వెళ్తుండగా.. ఆయన వాహనంపై దాడి జరిగింది. By B Aravind 14 May 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఇజ్రాయెల్ - హమాస్ మధ్య ఘర్షణలు మళ్లీ ముదురుతున్నాయి. ఐక్యరాజ్యసమితితో కలిసి.. గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతి చెందడం కలకలం రేపింది. మృతుడు ఐరాసలోని భద్రత, రక్షణ విభాగంలో(DSS) పనిచేస్తున్నారు. రఫాలోని యూరోపియన్ ఆసుపత్రికి వెళ్తుండగా.. ఆయన వాహనంపై దాడి జరిగింది. ఈ ఘటనలో మరో డీఎస్‌ఎస్ సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి ఐరాసలో పనిచేస్తున్న అంతర్జాతీయ సిబ్బందిలో జరిగిన తొలి మరణం ఇదే. Also Read: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు భారతీయుడి మృతిపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. సామాన్యులతో పాటు మానవతా సాయం అందిస్తున్న సిబ్బంది మృతి చెందడంతో.. కాల్పు విరమణ ఒప్పందానికి రావాలంటూ పిలుపునిచ్చారు. అలాగే బందీలను విడిచిపెట్టాలను హమాస్‌ను కోరారు. Also Read: ఆ ప్రాంతంలో 100 శాతం పోలింగ్.. ఎక్కడంటే #telugu-news #gaza మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి