Hardik Pandya faces Criticism: ఐపీఎల్లో కెప్టెన్సీ చేయడం.. టీమిండియాలకు ఇంటర్నేషనల్ లెవల్లో సారధిగా వ్యవహరించడం ఒక్కటే కాదు బ్రో.. ఈ విషయాన్ని గుజరాత్ బిడ్డ హార్దిక్ పాండ్యా(Hardik pandya) ఎంత త్వరగా తెలుసుకుంటే అంతమంచిది. టీ20ల్లో విండీస్‌ని తక్కువ అంచనా వేయకూడదన్న మేటర్ని మరిచిన పాండ్యా టీమిండియా సిరీస్ ఓటమికి ప్రత్యక్ష కారణమయ్యాడు. అటు బ్యాటింగ్‌లోనూ పాండ్యా ఫ్లాప్ అవుతూ వస్తున్నాడు. ఇదే అంశాన్ని లేవనెత్తాడు మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్(Parthiv patel). హార్దిక్ కెప్టెన్సీలో ఇటీవలి లోపాలను విశ్లేషించాడు. అసలు బౌలింగ్ ఛేంజ్ విషయంలో పాండ్యా ఆలోచనా తీరు సరిగ్గా లేదని విమర్శించాడు.
హార్దిక్ ఎందుకిలా?
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) టీమ్‌ను వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యా.. టీమిండియా (Team India) సారధిగా మాత్రం విండీస్ గడ్డపై ఫెయిల్ అయ్యాడు. కెప్టెన్‌గా పాండ్యా తీసుకున్న నిర్ణయాలపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. కరేబియన్ జట్టుపై హార్దిక్ తన బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోలేదని పార్థివ్ పటేల్ విమర్శించాడు. “నికోలస్ పూరన్ బ్యాటింగ్ చేస్తుండగా అక్షర్ పటేల్‌కి బౌలింగ్ ఇచ్చి.. యుజ్వేంద్ర చాహల్‌ను ఆపడం కరెక్ట్ కాదన్నాడు పార్థివ్. కెప్టెన్సీ విషయంలో పాండ్యా మరింత మెరుగు అవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
Pandya: ఏంటి భయ్యా ఇది..ఇలాగేనా కెప్టెన్సీ చేసేది? తుస్సుమంటున్న హార్దిక్!
విండీస్‌తో టీ20 సిరీస్ ఓడిపోయిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు పెరిగిపోతున్నాయి. కెప్టెన్‌గా హార్దిక్ చాలా మెరుగు అవ్వాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఏ సమయంలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలన్నదాంట్లో పాండ్యా ఫెయిల్ అవుతున్నట్టు చెప్పుకొచ్చాడు. అటు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పాత్రపైనే రోజురోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి.
Translate this News: