Pandya: ఏంటి భయ్యా ఇది..ఇలాగేనా కెప్టెన్సీ చేసేది? తుస్సుమంటున్న హార్దిక్!
విండీస్‌తో టీ20 సిరీస్ ఓడిపోయిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు పెరిగిపోతున్నాయి. కెప్టెన్‌గా హార్దిక్ చాలా మెరుగు అవ్వాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఏ సమయంలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలన్నదాంట్లో పాండ్యా ఫెయిల్ అవుతున్నట్టు చెప్పుకొచ్చాడు. అటు హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ పాత్రపైనే రోజురోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి.