/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/pandya-featured-image-1-jpg.webp)
Hardik Pandya faces Criticism: ఐపీఎల్‌లో కెప్టెన్సీ చేయడం.. టీమిండియాలకు ఇంటర్‌నేషనల్ లెవల్‌లో సారధిగా వ్యవహరించడం ఒక్కటే కాదు బ్రో.. ఈ విషయాన్ని గుజరాత్ బిడ్డ హార్దిక్ పాండ్యా(Hardik pandya) ఎంత త్వరగా తెలుసుకుంటే అంతమంచిది. టీ20ల్లో విండీస్‌ని తక్కువ అంచనా వేయకూడదన్న మేటర్‌ని మరిచిన పాండ్యా టీమిండియా సిరీస్ ఓటమికి ప్రత్యక్ష కారణమయ్యాడు. అటు బ్యాటింగ్‌లోనూ పాండ్యా ఫ్లాప్ అవుతూ వస్తున్నాడు. ఇదే అంశాన్ని లేవనెత్తాడు మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్(Parthiv patel). హార్దిక్ కెప్టెన్సీలో ఇటీవలి లోపాలను విశ్లేషించాడు. అసలు బౌలింగ్ ఛేంజ్ విషయంలో పాండ్యా ఆలోచనా తీరు సరిగ్గా లేదని విమర్శించాడు.
హార్దిక్ ఎందుకిలా?
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) టీమ్‌ను వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యా.. టీమిండియా (Team India) సారధిగా మాత్రం విండీస్ గడ్డపై ఫెయిల్ అయ్యాడు. కెప్టెన్‌గా పాండ్యా తీసుకున్న నిర్ణయాలపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. కరేబియన్ జట్టుపై హార్దిక్ తన బౌలర్లను సరిగ్గా ఉపయోగించుకోలేదని పార్థివ్ పటేల్ విమర్శించాడు. "నికోలస్ పూరన్ బ్యాటింగ్ చేస్తుండగా అక్షర్ పటేల్‌కి బౌలింగ్ ఇచ్చి.. యుజ్వేంద్ర చాహల్‌ను ఆపడం కరెక్ట్ కాదన్నాడు పార్థివ్. కెప్టెన్సీ విషయంలో పాండ్యా మరింత మెరుగు అవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
Captain Pandya in the series deciding 5th T20I v WI:
With bat - 14 runs in 18 balls, SR 77.77 - Lowest SR among all top batters
With ball - 32 runs in 18 balls, Eco 10.66 - Worst Eco among all fast bowlers #INDvsWI #Pandya pic.twitter.com/AvTeAyZFaX
— Bharath Seervi (@SeerviBharath) August 13, 2023
బ్యాటింగ్‌లోనూ తుస్సే:
ఇటు కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ హార్దిక్ పాండ్యా చెత్తగా ఆడుతున్నాడు. విండీస్‌పై వన్డే, టీ20 సిరీస్‌లో ఎనిమిది మ్యాచ్‌లో ఏడు సార్లు బ్యాటింగ్‌కి దిగిన హార్దిక్ కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ఇక రీసెంట్ ఐపీఎల్‌లోనూ అతని దగ్గర నుంచి చెప్పుకొదగ్గ ప్రదర్శన రాలేదు. హార్దిక్ బ్యాట్ నుంచి మెరుపులు చూసి చాలా కాలం అయ్యింది. టీ20ల్లోనూ బాల్స్ తింటూ ఓటమికి ప్రధాన కారణం అవుతున్నాడు హార్దిక్. అటు బౌలింగ్‌లోనూ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు హార్దిక్. విండీస్‌పై టీ20ల్లో కెప్టెన్‌గా మొదటి రెండు టీ20 మ్యాచ్‌లు ఓడిపోవడానికి ప్రధాన కారణం ద్రవిడ్, పాండ్యా చేసిన ప్రయోగాలేనని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. కెప్టెన్‌గా ప్లేయర్లను సపోర్ట్ చేయాల్సిన పాండ్యా తన పని తాను చేసుకుపోతున్నాడని.. నిర్ణయాలు కూడా ఏకపక్షంగా తీసుకుంటున్నాడన్న విమర్శలు ఉన్నాయి.
అటు హెడ్ కోచ్‌గా ద్రవిడ్ (Rahul Dravid) పాత్రపైనే అనేక సందేహాలు నెలకొన్నాయి. టెస్టుల సంగతి పక్కన పెడితే వన్డే, టీ20ల్లో ద్రవిడ్ స్ట్రాటజీలు ఫెయిల్ అవుతున్నాయంటున్నారు క్రికెట్ పండితులు. వన్డే ప్రపంచ కప్‌కి సమయం ముంచుకొస్తున్నా ఇప్పటివరకు జట్టు తుది కూర్పు ఫిక్స్ అవ్వకపోవడం ఈ విమర్శలకు ప్రధాన కారణం. ఈసారి ప్రపంచ కప్ స్వదేశంలో జరుగుతుండడం టీమిండియాకు ప్లస్. అలాంటి సమయంలో ఇలాంటి మైనస్‌లు ఉండకూడదు.
Also Read: WWE అభిమానులకు శుభవార్త.. రెజ్లింగ్ పోటీలకు సిద్ధమైన హైదరాబాద్