Canada: కెనడాలో భారత విద్యార్ధుల నిరసన..భయపెడుతున్న బహిష్కరణ

కెనడాలో భారతీయులతో పాటూ విదేశీ విద్యార్ధులు నిరసనలు చేస్తున్నారు. తమను దేశం నుంచి వెళ్ళగొట్టేస్తారనే భయంతో దాదాపు 70 వేల మంది విద్యార్ధులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రిన్స్‌ఎడ్వర్డ్‌ ఐలాండ్‌తోపాటు,ఒంటారియో, మనితోబా, బ్రిటిష్‌ కొలంబియాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు.

New Update
Canada: కెనడాలో భారత విద్యార్ధుల నిరసన..భయపెడుతున్న బహిష్కరణ

Deportation Fear In Indian Students: కెనడాలో కొత్త పాలసీ విధానాలను ప్రవేశ పెట్టారు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో. కెనడాకు చదువుకోవడానికి వచ్చే అంతర్జాతీయ విద్యార్ధుల సంఖ్యను తగ్గించడంతో పాటూ తక్కువ జీతం ఇచ్చే విభాగాల్లో పని చేస్తున్న విదేశీ వర్కర్ల వాటాను 25 శాతానికి తగ్గిస్తామని ట్రుడో చెప్పారు. ఈ విషయం ఇప్పుడు కెనడాలోని విదేశీ విద్యార్ధుల్లో కలకలం రేపింది. కెనడా ప్రధాని చెప్పిన నిర్ణయాన్ని అక్కడ ప్రభుత్వం కనుక అమలు చేస్తే దాదాపు 70వేల విద్యార్ధుల మీద ప్రభావం పడుతుంది. గ్రాడ్యుయేట్‌ల వర్క్ పర్మిట్‌ల గడువు ఈ సంవత్సరం చివరిలో ముగిసే సమయానికి వారందరూ బహిష్కరణకు గురైయ్యే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోన్న విదేశీ విద్యార్థులు నిరసనల బాటపట్టారు. ప్రిన్స్‌ఎడ్వర్డ్‌ ఐలాండ్‌తోపాటు, ఒంటారియో, మనితోబా, బ్రిటిష్‌ కొలంబియాల్లో నిరసన ర్యాలీలు చేపట్టారు.

గత కొన్ని ఏళ్ళుగా కెనడాలోని జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దీనిలో ఇమ్మిగ్రేషన్ ద్వారా వచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. దీనిని కంట్రోల్‌లోకి తీసుకురావడం కోసమే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కొత్త విధానాలను చేపడుతోంది. అందులో భాగంగా విదేశీ వర్కర్లను తగ్గించుకోవాలని అనుకుంటోంది. దీనిపై చర్చించిన ట్రుడో ప్రభుత్వం విదేశీ వర్కర్ల విధానంలో మూడు మార్పులను చేసింది. వాటిని సెప్టెంబర్ 26 నుంచి అమల్లోకి తీసుకురానుంది.

కొత్త నిబంధనల ప్రకారం నిర్మాణ, ఆరోగ్య, ఆహార భద్రత రంగాల్లో పనిచేసే విదేశీ ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. తక్కువ వేతన విదేశీ కార్మికులపై ఆధారపడటం కంటే శిక్షణ, సాంకేతికతలపై కెనడా వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని కెనడా ప్రధాని స్టిన్ ట్రుడో అన్నారు. వీటితో పాటూ పెర్మనెంట్ రెసిడెన్స్ విషయంలో కూడా మార్పులు తీసుకువస్తామని చెబుతున్నారు.

Also Read: New Delhi: కార్ పార్కింగ్ కోసం కొట్టుకున్న ఇరుగుపొరుగు..ఆరుగురు అరెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు