Car Parking Dispute: ఢిల్లీలోని నోయడాలో కారు పార్కింగ్ స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య తగాదా హింసాత్మకంగా మారింది. ఎప్పటి నుంచో ఇరుగు, పొరుగున ఉంటున్నారు. ఒకరికి ఒకరు బాగా తెలిసిన వారే. కానీ కారు పార్కింగ్ విషయంలో గొడవపడి రచ్చ రచ్చ చేశారు. నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్ 72లో ఈ ఘటన జరిగింది. ఇక్కడే నివాసం ఉండే రాజీవ్ చౌహాన్, నితిన్ మధ్య కార్ పార్కింగ్ వివాదం జరిగింది. నితిన్ తరుఫు వ్యక్తులు మొదట రాజీవ్ చౌహాన్ పై దాడి చేశారు. ఆ తరువాత రాజీవ్ కొడుకులు నితిన్ కారును ధ్వంసం చేశారు. కర్రలు, రాడ్లు, క్రికెట్ బ్యాట్లతో కారు అద్దాలను పగులగొట్టారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల్లో మహిళల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..New Delhi: కార్ పార్కింగ్ కోసం కొట్టుకున్న ఇరుగుపొరుగు..ఆరుగురు అరెస్ట్
కొన్నాళ్ళ క్రితం రెండు ఇళ్ళ మధ్య కార్ పార్కింగ్ గొడవ అనే కాన్సెప్ట్‌తో ఓ సినిమా వచ్చింది గుర్తుందా. అచ్చం అలాంటి గొడవే నిన్న న్యూ ఢిల్లీలోని నోయిడాలో జరిగింది. కానీ అది కాస్తా పెద్దది అయి కొట్టుకునే వరకు వెళ్ళింది. వివరాలు కింద చదివేయండి.
Translate this News: