Jobs: భారత నేవీలో ఉద్యోగాలు..లక్షల్లో జీతాలు

పరీక్షలేవీ నిర్వహించకుండానే ఉద్యోగాల్లోకి తీసుకుంటోంది భారత నేవీ. షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో భారతీయ నౌకాదళం 254 పోస్టులకు నోటిషికేషన్ విడుదల చేసింది. బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ చదివినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చును.

Jobs: భారత నేవీలో ఉద్యోగాలు..లక్షల్లో జీతాలు
New Update

Indian Navy Posts: ఇంజనీరింగ్ విద్యార్ధులకు భారత నేవీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. పరీక్సలు ఏవీ లేకుండానే ఉద్యోగంలో జాయిన్ అవ్వొచ్చని చెబుతోంది. జీతం కూడా లక్షల్లో ఉంటుందని ప్రకటించింది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో భారతీయ నౌకాదళంలో 254 ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటనను జారీ చేసింది. బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ విద్యార్హతలు ఉన్నవారు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చును. అకడమిక్ మార్కుల ప్రకారం అభ్యర్ధులను ఎన్నుకోనున్నారు. మెరిట్‌ను బట్టి అభ్యర్ధులను వడపోసి ఇంటర్వూలు నిర్వమిస్తారు. ఇందులో సెలెక్ట్ అయినవారికి శిక్షణ ఇస్తారు. దాని తర్వాత సబ్‌ లెఫ్టినెంట్ హోదా గల ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. జీతం కూడా లక్ష నుంచి మొదలవుతాయి.

భారత నేవీ ప్రకటించిన పోస్ట్‌లన్నీ కూడా ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ బ్రాంచ్‌లకు సంబంధించినవే. ఇవన్నీ లెవల్ -10 హోదా ఉద్యోగాలు. దీని ప్రకారం ఇవన్నీ పెద్ద ఉద్యోగాల కిందే లెక్క. పైగా వీటికి ఏమీ పరీక్సలు నిర్వహించకపోవడం అదనపు ప్రయోజనం. విద్యార్ధులకు కనుక ఇంజనీరింగ్‌లో , పీజీల్లో ఎక్కువ మార్కులు వస్తే ఉద్యోగం వచ్చేసినట్టే అని చెబుతున్నారు. ఇంటర్వ్యూ కూడా పెద్ద కష్టంగా ఉందని అంటున్నారు. ఒక్కో పోస్ట్‌కు పరిమిత సంఖ్యలోనే అభ్యర్ధులను కూడా పిలుస్తున్నారు. కాబట్టి కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వూలు నిర్వహిస్తుంది. దీనిలో అర్హత పొందిన వారికి వైద్య పరీక్సలు నిర్వహించి.. తుది నియామకానికి ఖరారు చేస్తారు.

ఉద్యోగానికి ఎంపిక అయిన తర్వాత ఎజిమాళలో ఉన్న నేవల్ అకాడమీలో 22 వారాల పాటూ వివిధ బాగాల్లో శిక్షణ ఇస్తారు. తరువాత ఏ ఉద్యోగానికి అయితే తీసుకున్నారో అందులో మరో 22 వారాల తర్ఫీదునిస్తారు. వీటన్నింటి తరువాతనే విధుల్లోకి తీసుకుంటారు. జీతం 56,100తో పాటూ డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం అందుకుంటారు. అంటే దాదాపు లక్షకు పైగా జీతం వస్తుంది. ప్రొబేషన్‌ వ్యవధి పోస్టును బట్టి రెండు లేదా మూడేళ్లు ఉంటుంది. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ కాబట్టి ఉద్యోగానికి ఎంపికైనవారు పదేళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. ఆ తర్వాత రెండేళ్ల చొప్పున రెండు సార్లు సర్వీసును పొడిగిస్తారు. మొత్తం మీద 14 ఏళ్ళు ఈ ఉద్యోగాల్లో కొనసాగవచ్చును. ఆ తరువాత మాత్రం బయటకు వచ్చేయాల్సిందే.

ఈ ఉద్యోగాలకు ప్రస్తుతం ఇంజనీరింగ్ లేదా ఇతర కోర్సులు చివర ఏడాది చదువుతన్న విద్యార్ధులు కూడా అప్లై చేసుకోవచ్చును. ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ ఉన్నవారికి మాత్రం అకడమిక్ మార్కుల్లో 5శాతం సడలింపు ఉంటుంది. పోస్ట్ ప్రకారం వయసును నిర్ధారించారు. 2000 నుంచి 2006 మధ్య పుట్టిన వారందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చును. https://www.joinindiannavy.gov.in/ అనే వెబ్ సైట్‌లో దరఖాస్తులను నింపాలి. మార్చి 10వ తేదీ చివరి రోజు. బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్‌కత్తాలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Also Read:Andhra Pradesh : పదవ తరగతి హాల్‌ టికెట్లు నేటి నుంచి విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

#officers #indian #jobs #navy #recrutment
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe