/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-5.jpg)
Indian Hockey Team: ఒలింపిక్స్‌లో మొదటి నుంచి టీమ్ ఇండియా హాకీ ప్లేయర్లు మంచి ప్రతిభ కనరుతూ వచ్చారు. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్‌కు చేరుకున్నారు. ఇందులో గెలిస్తే పతకం రావడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఈ రోజు జరిగిన సెమీస్ మ్యాచ్‌లో జర్మనీ చేతిలో ఓడిపోయింది టీమ్ ఇండియా. 2–3 తేడాతో ఓటమి పాలయ్యారు. కీలక పోరులో గెలిచేందుకు తీవ్రంగా పోరాడినప్పటికీ ఫలితం రాలేదు. ఆశలన్నీ నిరాశలయ్యాయి. దీంతో ఇప్పుడు కాంస్యం కోసం పోరాటం కోసం భారత్ సిద్ధమయింది. ఇందులో స్పెయిన్‌తో టీమ్ ఇండియా తలపడనుంది.