RS Praveen Kumar: రాజ్యాంగం ప్రమాదంలో ఉంది.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని అన్నారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేంద్రంలో తిరిగి బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. దేశంలో విచ్ఛిన్నకర అజెండాను అమలు చేస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. By V.J Reddy 06 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి RS Praveen Kumar: రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ధ్వజమెత్తారు తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, దీన్ని అడ్డుకోవలసిన కాంగ్రెస్ పరోక్షంగా బీజేపీకి వత్తాసుపలుకుతుందని ఆరోపించారు. బుధవారం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు. బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్న అయన కేంద్రంలో తిరిగి బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసమే బీఎస్పీ, బీఆర్ఎస్ తో కలిసి రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ALSO READ: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప! బీజేపీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ విఫలం.. దేశంలో విచ్ఛిన్నకర అజెండాను అమలు చేస్తున్న బీజేపీని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. జన్వాడలో ప్రార్థన మందిరంపై దాడి జరిగితే సీఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని విమర్శించారు. బీఎస్పీ-బీఆర్‌ఎస్ పొత్తు బహుజనుల ఆకాంక్ష అని తెలిపిన ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడానికి బీఎస్పీ బీఆర్ఎస్ తో జతకట్టినట్లు వివరించారు. బహుజనులకు న్యాయం జరగాలనేది పార్టీ లక్ష్యమన్న అయన ఈ పొత్తుతో ప్రజలకు మంచి జరగబోతున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైన బిఆర్ఎస్ తో బీఎస్పీ కలవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఎస్పీ- బీఆర్‌ఎస్ పోటీ చేసే స్థానాలపై త్వరలోనే విధివిధానాలు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రజలు బీఎస్పీ, బిఆర్ఎస్ కూటమిని ఆశీర్వదించాలని కోరారు. బిఆర్ఎస్ పాలనలో కుంభకోణాల మాయం అని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క కుంభకోణాన్ని కూడా బయట పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో సీఎం రేవంత్ రెడ్డి రోజుకో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు రోడ్లమీదకి వస్తున్నారన్నారని విమర్శించారు. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్లు అమలుచేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో బీఎస్పీ గెలవాలనే దృఢ నిశ్చయంతో పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో విద్యా, ఉద్యోగాలు, వ్యవసాయ రంగాల్లో నాగర్ కర్నూల్ ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయిందని విమర్శించారు. బీఎస్పీ, బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులు ఎక్కడెక్కడ కలిసి పోటీ చేస్తారనే విధివిధానాలను త్వరలో మీడియాకు వెల్లడిస్తామన్నారు. #congress #cm-revanth-reddy #bjp #rs-praveen-kumar #2024-lok-sabha-elections #brs-bsp-alliance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి