Jammu-kashmir: పూంచ్‌లో చైనా గ్రెనేడ్లు..స్వాధీనం చేసుకున్న భారత ఆర్మీ

జమ్మూ–కశ్మీర్‌‌లోని పూంచ్ జిల్లాలోని షీందార్ సెక్టార్‌‌లో ఆరు చైనా గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకుంది భారత ఆర్మీ. గత కొన్ని రోజులుగా భారత ఆర్మీ మీద ఉగ్రవాదులు దాడులు జరుపుతూనే ఉన్నారు. ఈనేపథ్యంలో భారత ఆర్మీ చేస్తున్న తనిఖీల్లో గ్రనేడ్లు దొరికాయి.

Terrorists: దేశ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం..
New Update

Indian Army: మరికొన్ని రోజుల్లో జమ్మూ–కశ్మీర్‌‌లో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు మూడు దఫాల్లో జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ జమ్మూ–కశ్మీర్‌‌లో భద్రతను కట్టుదిట్టం చేసింది. రోజూ అన్ని ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఉగ్రవాదులు దాడులు చేసే ప్రాంతాల్లో ఎక్కువగా తనిఖీలను నిర్వహిస్తోంది. ఈ రోజు జరిపిన సోదాల్లో భారత ఆర్మీ ఆరు గ్రనేడ్లను స్వాధీనం చేసుకుంది. చైనాలో తయారైన గ్రనేడ్లుగా ఆర్మీ గుర్తించింది. పూంచ్‌ జిల్లాలోని షీందార్ సెక్టార్‌‌లో ఇవి లభ్యమయ్యాయి. ఇక గత వారం లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదిని ఇదే జిల్లాలో భారత ఆర్మీ పట్టుకుంది. ఇతను లష్కరే తోయిబా గైడ్‌గా గుర్తించింది. అంతకు ముందు ఏప్రిల్‌లో ఒకతనిని భారత సైన్యం పట్టుకున్నారు. అతని దగ్గర పాకిస్థాన్‌లో తయారైన పిస్టల్, రెండు చైనీస్ గ్రెనేడ్‌లు లభించాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటి గ్రనేడ్లను ఆర్మీ స్వాధీనం చేసుకుంది.

#indian-army #china #jammu-kashmir #poonch #grenades
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe