World cup:టాస్ గెలిచిన భారత్...ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతున్న ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ధర్మశాల స్టేడియం పేస్ కు అనుకూలించే పిచ్ కావడంతో రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

New Update
IND vs NZ: రోహిత్‌కి ఆ విషయంలో తలనొప్పి.. వరల్డ్‌కప్‌లో మరో హై వోల్టేజ్‌ ఫైట్!

మెగా సమరానికి సమయం ఆసన్నమైంది. వరల్డ్‌కప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పోరుకు టాస్‌ పడింది.. టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఇక ప్రపంచకప్ లో భారత్-న్యూజిలాండ్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఈ రికార్డ్ ను రోహిత్ సేన ఈసారి కూడా నిలబెడుతుందా లేదా అనేది చూడాలి. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో ఈరోజు మ్యాచ్ జరుగుతోంది.

ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్…. ఇలా వరుసగా అందరినీ ఓడించుకుంటూ ప్రపంచకప్ (World Cup 2023) లో దూసుకుపోతోంది టీమ్ ఇండియా. స్వదేశీ పిచ్ ల మీద ఆడడం భారత్ కు బాగా కలిసొస్తోంది. అయితే భారత్ కు అసలు సవాలు ఎదురు అవనుంది. మరోవైపు కీవీస్ కూడా తమ సత్తా చూపిస్తోంది. సెమీస్ కు బలమైన జట్లలో ఒకటిగా నిలిచింది. కాబట్టి ఈ రోజు మ్యాచ్ టఫ్ గా ఉండే అవకాశం ఉంది. రెండు జట్లు తమ పూర్తి ఆటను కనబరిస్తే మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పవచ్చును.

ఈరోజు మ్యాచ్ ధర్మశాలలో జరగనుంది. ఇది పేసర్లకు అనుకూలించే పిచ్. ఇది కొంచెం న్యూజిలాండ్ కు అనుకూలించే విషయమే. పేస్, స్పిన్ లలో బలంగా ఉన్న న్యూజిలాండ్ బౌలర్ల నుంచి భారత్ బ్యాట్స్ మెన్ కు సవాలు తప్పదు. కాబట్టి ఈ రోజు మ్యాచ్ అంతా బ్యాటర్లు ఎలా ఆడతారు అన్నదాని మీదనే ఆధారపడి ఉంది. మరోవైపు ధర్మశాలలో వాతావరణం చల్లగా ఉంటుంది.

జట్లు...

భారత్: రోహిత్(కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్ దీప్, షమి , బుమ్రా, సిరాజ్

న్యూజిలాండ్:
కాన్వే, యంగ్, రచిన్, మిచెల్, లేథమ్(కెప్టెన్), ఫిలిప్స్, చాప్ మన్, శాంట్నర్, ఫెర్గూసన్, హెన్రీ, బౌల్ట్.

Advertisment
తాజా కథనాలు