కసి తీర్చుకున్న టీమ్ ఇండియా-ఆస్ట్రేలియాపై విజయం

పాత కసిని తీర్చేసుకుంది టీమ్ ఇండియా. వరల్డ్‌కప్‌లో ఓడిపోయి బాధపడుతున్న భారత జట్టు ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ -8లో ఆస్ట్రేలియాను ఓడించి లెక్క సరిచేసింది. 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

కసి తీర్చుకున్న టీమ్ ఇండియా-ఆస్ట్రేలియాపై విజయం
New Update

టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా సెమీ ఫైనల్లోకి దూసకెళ్ళింది. ఆస్ట్రేలియాను 24 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (92) దంచికొట్టాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులను మాత్రమే చేయగలిగింది. హెడ్‌ 74 పరుగులు చేసిన్పటికీ ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ 3, కుల్దీప్‌ 2, అక్షర్‌, బుమ్రా ఒక వికెట్‌ తీశారు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 పరుగులు, 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో చెలరేగిపోయాడు కానీ చివరలో సెంచరీ మిస్ అయిపోయాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టీమ్ ఇండియా ఓపెనర్‌గా దిగిన విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.తరువాత రిషభ్‌ పంత్ 15 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 31 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. హార్దిక్ పాండ్య 17 బంతుల్లో 27 పరుగులు, 1 ఫోర్, 2 సిక్స్‌లతో నాటౌట్‌గా నిలిచాడు. శివమ్ దూబె 22 బంతుల్లో 28 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ (1/14) పొదుపుగా బౌలింగ్ చేశాడు. మిచెల్ స్టార్క్ (2/45), స్టాయినిస్‌ (2/56) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కమిన్స్‌ 48, ఆడమ్ జంపా 41 పరుగులు ఇచ్చారు.

ఈ మ్యాచ్‌తో టీమ్ ఇండియా సెమీస్‌కి వెళ్ళిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను కష్టం చేసుకుంది. ఇప్పటికే ఆఫ్షనిస్తాన్ ఓడిపోయిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఈ మ్యాచ్‌ కూడా ఓడిపోవడంతో దాదాపు ఆ టీమ్‌కు సెమీస్ ఛాన్స్‌లు కల్పోయినట్లే అయింది. ఇక భారత్ తన సెమీస్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో ఆడనుంది.

Also Read:Andhra Pradesh: సీనియర్ ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేది బదిలీ

#cricket #india #australia #t20-world-cup #match
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe