కసి తీర్చుకున్న టీమ్ ఇండియా-ఆస్ట్రేలియాపై విజయం పాత కసిని తీర్చేసుకుంది టీమ్ ఇండియా. వరల్డ్‌కప్‌లో ఓడిపోయి బాధపడుతున్న భారత జట్టు ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ -8లో ఆస్ట్రేలియాను ఓడించి లెక్క సరిచేసింది. 24 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. By Manogna alamuru 24 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా సెమీ ఫైనల్లోకి దూసకెళ్ళింది. ఆస్ట్రేలియాను 24 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (92) దంచికొట్టాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులను మాత్రమే చేయగలిగింది. హెడ్ 74 పరుగులు చేసిన్పటికీ ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3, కుల్దీప్ 2, అక్షర్, బుమ్రా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 పరుగులు, 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో చెలరేగిపోయాడు కానీ చివరలో సెంచరీ మిస్ అయిపోయాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. టీమ్ ఇండియా ఓపెనర్‌గా దిగిన విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.తరువాత రిషభ్ పంత్ 15 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 16 బంతుల్లో 31 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. హార్దిక్ పాండ్య 17 బంతుల్లో 27 పరుగులు, 1 ఫోర్, 2 సిక్స్‌లతో నాటౌట్‌గా నిలిచాడు. శివమ్ దూబె 22 బంతుల్లో 28 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు.ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ (1/14) పొదుపుగా బౌలింగ్ చేశాడు. మిచెల్ స్టార్క్ (2/45), స్టాయినిస్ (2/56) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కమిన్స్ 48, ఆడమ్ జంపా 41 పరుగులు ఇచ్చారు. ఈ మ్యాచ్‌తో టీమ్ ఇండియా సెమీస్‌కి వెళ్ళిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను కష్టం చేసుకుంది. ఇప్పటికే ఆఫ్షనిస్తాన్ ఓడిపోయిన ఆస్ట్రేలియా ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా ఓడిపోవడంతో దాదాపు ఆ టీమ్‌కు సెమీస్ ఛాన్స్‌లు కల్పోయినట్లే అయింది. ఇక భారత్ తన సెమీస్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో ఆడనుంది. Also Read:Andhra Pradesh: సీనియర్ ఐఏఎస్ గోపాలకృష్ణ ద్వివేది బదిలీ #cricket #match #australia #t20-world-cup #india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి