IND VS SA: ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు.. మరి రోహిత్ చరిత్ర సృష్టిస్తాడా? 31ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడా?

దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌ రెండు టెస్టుల సిరీస్‌ డిసెంబర్ 26 నుంచి మొదలుకానుంది.1992 నుంచి ఇప్పటివరకు సఫారీ గడ్డపై భారత్‌ 8 టెస్టు సిరీస్‌లు ఆడింది. వీటిలో ఒక్క టెస్టు సిరీస్‌ కూడా భారత్‌ గెలవలేదు. దీంతో 31ఏళ్ల నిరీక్షణకు రోహిత్‌ తెరదించుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

New Update
IND VS SA: ధోనీ, కోహ్లీ వల్ల కాలేదు.. మరి రోహిత్ చరిత్ర సృష్టిస్తాడా? 31ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడా?

రోహిత్(Rohit Sharma) కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఓడిపోయాం అన్నమాటే కానీ కెప్టెన్‌గా రోహిత్‌ను వేలుఎత్తి ఎవరూ చూపించలేరు. వరుస గాయల బారిన పడిన ప్లేయర్లను కూడా రూట్‌లోకి తీసుకొచ్చి టీమిండియాకు విజయాల బాట పట్టించిన సారధి అతను. గ్రౌండ్‌లో ఎన్నో తెలివైన నిర్ణయాలు తీసుకునే కెప్టెన్‌గా పేరొందిన రోహిత్‌ శర్మ మరో ఛాలెంజ్‌కు రెడీ అయ్యాడు. అసలుసిసలైన క్రికెట్‌ ఫార్మెట్‌ అయిన టెస్టుల్లో దక్షిణాఫ్రికా గడ్డపై తన సత్తా చూపించడానికి సిద్ధమయ్యాడు. 31ఏళ్ల నుంచి దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌ ఎప్పుడూ కూడా టెస్టు సిరీస్‌ విజయం సాధించలేదు. అజార్‌, ద్రవిడ్‌, ధోనీ నుంచి కోహ్లీ, రాహుల్ వరకు అందరూ ఈ ఫీట్ సాధించడంలో ఫెయిల్ అయ్యారు. అయితే రోహిత్‌ చరిత్ర సృష్టిస్తాడని.. 31ఏళ్ల నిరీక్షణకు తెరదించుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

8వ కెప్టెన్ రోహిత్:
భారత్-దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 26 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత జట్టు టెస్టు సిరీ ఆడడం ఇది 9వ సారి. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మొత్తం 8 టెస్టుల సిరీస్‌లో భారత జట్టు ఎప్పుడూ విజయం సాధించలేదు. 7 సిరీస్‌లు ఓడిపోగా, ఒక సిరీస్‌ను డ్రా చేసుకుంది. 1992లో టీమిండియా తొలిసారిగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. అజార్‌ కెప్టెన్సీలో ఈ సిరీస్‌ ఆడింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక మ్యాచ్‌ దక్షిణాఫ్రికా గెలవగా.. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఆ తర్వాత 1996లో, 2001లో, 2010లో, 2012లో, 2017లో భారత్ సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌లు ఆడింది. 2010-11 సంవత్సరంలో మాత్రమే ఇక్కడ సిరీస్‌ను డ్రా చేసుకోవడంలో టీమ్ ఇండియా సఫలీకృతమైంది. ఇది కాకుండా ప్రతి పర్యటనలోనూ భారత్‌ సిరీస్‌ను ఓడిపోయింది.

దక్షిణాఫ్రికాలో టీమిండియా మొత్తం 23 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ 23 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఇక్కడ 12 మ్యాచ్‌లు ఓడిపోగా, 7 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ లెక్కలను బట్టి దక్షిణాఫ్రికాలో టెస్టు గెలవడం టీమిండియాకు ఎప్పటి నుంచో ఎంత కష్టమో అర్థమవుతుంది. మరి రోహిత్‌ ఈ సారి ఏం చేస్తాడో చూడాల్సి ఉంటుంది.

రెండు జట్ల స్క్వాడ్‌లు:

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, రవి అశ్విన్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసీద్.

దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్గి, డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్సన్, మార్కో యాన్సిన్, వియాన్ ముల్డర్, డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రెస్టన్ స్టబ్స్, కైల్ వరెన్ని, నాండ్రే బెర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, ఎల్ కేశవ్ మహారాజ్, కగిసో రబడా.

Also Read: హార్దిక్‌ పాండ్యా కోసం అక్షరాలా రూ.100కోట్లు ఖర్చు చేసిన ముంబై.. కారణం ఇదే!

WATCH:

Advertisment
తాజా కథనాలు