IND VS SA: బెంచ్‌కే పరిమితం కానున్న నంబర్‌-1 ప్లేయర్‌.. దక్షిణాఫ్రికాతో టెస్టుకు భారత్‌ తుది జట్టు ఇదే!

సెంచూరియన్‌ వేదికగా రేపటి(డిసెంబర్26)నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి టెస్టు ఆడనుంది. పిచ్‌ పేసర్లకు ఫేవర్‌ కావడంతో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో ఇండియా బరిలోకి దిగనుంది. అంటే జడేజా కోసం నంబర్‌-1 బౌలర్‌ అశ్విన్‌ మరోసారి త్యాగం చేయాల్సి ఉంటుంది.

IND VS SA: బెంచ్‌కే పరిమితం కానున్న నంబర్‌-1 ప్లేయర్‌.. దక్షిణాఫ్రికాతో టెస్టుకు భారత్‌ తుది జట్టు ఇదే!
New Update

India Vs South Africa: అసలుసిసలైన క్రికెట్‌ సమరానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. క్రికెట్‌ అంటేనే టెస్టులు.. టెస్టులు అంటేనే క్రికెట్. పరిమిత ఓవర్ల ఫార్మెట్లను ఇంతకాలం ఎంజాయ్‌ చేస్తూ వచ్చిన భారత్‌ క్రికెట్‌ అభిమానులు ఇప్పుడు టెస్టు మోడ్‌లోకి వెళ్తున్నారు. ట్రూ క్రికెట్‌ లవర్స్‌ ఎప్పుడూ టెస్టులను ఆదరిస్తారు. ఎందుకుంటే ప్లేయర్ల వ్యక్తిగత టాలెంట్‌ బయటపడే ఫార్మెట్ ఇదే. దక్షిణాఫ్రికా(South Africa) వేదికగా రెండు టెస్టుల సిరీస్‌ రేపటి నుంచి ఆరంభంకానుంది. సెంచూరియన్‌లో తొలి టెస్టు జరగనుంది. భారత్‌(India) కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30నిమిషాలకు మ్యాచ్‌ స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్‌ జట్టు కూర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. ఎందుకుంటే రహానే, పుజారా లేకుండానే బరిలోకి దిగనున్నారు.

యువకులకు మంచి అవకాశం:
ఓపెనర్లగా రోహిత్ శర్మతో (Rohit Sharma) పాటు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ గ్రౌండ్‌లోకి దిగనున్నాడు. ఇది జైస్వాల్‌కు ఛాలెంజింగ్‌గా చెప్పవచ్చు. ఇక వన్‌డౌన్‌లో పుజారా లేని లోటును శుభమన్‌గిల్‌ భర్తీ చేయాలని తహాతహలాడుతున్నాడు. అయితే గత వెస్టిండీస్‌ టెస్టు టూర్‌లో గిల్‌ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. కేవలం ఇండియా పిచ్‌లపైనే గిల్‌ రాణిస్తున్నాడన్న విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలకు చెక్‌ పెట్టాలంటే గిల్‌ కచ్చితంగా తానేంటో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక 2 డౌన్‌లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) దిగుతాడు.. తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ వస్తాడు. ఇక ఆ తర్వాత ఆరో స్థానంలో కీపర్‌ రాహుల్‌ ఎంట్రీ ఇస్తాడు. నిజానికి గతేడాది బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో రాహుల్‌ సరిగ్గా ఆడలేదు. అయినా తెలుగు కీపర్‌ భరత్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత జడేజా, ఠాకూర్‌, సిరాజ్‌, బుమ్రా బ్యాటింగ్‌కు వస్తారు. పిచ్‌ పేసర్లకు అనుకూలం కావడంతో టెస్టు నంబర్‌-1 బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్-11 : రోహిత్ శర్మ (సి), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/ఆర్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్

దక్షిణాఫ్రికా ప్రాబబుల్ ప్లేయింగ్-11 : డీన్ ఎల్గర్, టెంబా బావుమా (సి), ఐడెన్ మార్క్రామ్, కీగన్ పీటర్సన్, టోనీ డి జోర్జి, కైల్ వెర్రెయిన్ (WK), కేశవ్ మహరాజ్, లుంగి ఎన్గిడి, కగిసో రబడ, గెరాల్డ్ కోయెట్జీ, నాండ్రే బర్గర్.

Also Read: ‘తాత్కాలిక కమిటీ ఏర్పాటు..’ క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయంతో బీజేపీ ఎంపికి బిగ్ షాక్‌!

WATCH:

#cricket #sports-news #cricket-news #india-vs-south-africa #ravindra-jadeja #ravichandran-ashwin
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe