India Vs South Africa: అసలుసిసలైన క్రికెట్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. క్రికెట్ అంటేనే టెస్టులు.. టెస్టులు అంటేనే క్రికెట్. పరిమిత ఓవర్ల ఫార్మెట్లను ఇంతకాలం ఎంజాయ్ చేస్తూ వచ్చిన భారత్ క్రికెట్ అభిమానులు ఇప్పుడు టెస్టు మోడ్‌లోకి వెళ్తున్నారు. ట్రూ క్రికెట్ లవర్స్ ఎప్పుడూ టెస్టులను ఆదరిస్తారు. ఎందుకుంటే ప్లేయర్ల వ్యక్తిగత టాలెంట్ బయటపడే ఫార్మెట్ ఇదే. దక్షిణాఫ్రికా(South Africa) వేదికగా రెండు టెస్టుల సిరీస్ రేపటి నుంచి ఆరంభంకానుంది. సెంచూరియన్‌లో తొలి టెస్టు జరగనుంది. భారత్(India) కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30నిమిషాలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు కూర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. ఎందుకుంటే రహానే, పుజారా లేకుండానే బరిలోకి దిగనున్నారు.
పూర్తిగా చదవండి..IND VS SA: బెంచ్‌కే పరిమితం కానున్న నంబర్-1 ప్లేయర్.. దక్షిణాఫ్రికాతో టెస్టుకు భారత్ తుది జట్టు ఇదే!
సెంచూరియన్ వేదికగా రేపటి(డిసెంబర్26)నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టెస్టు ఆడనుంది. పిచ్ పేసర్లకు ఫేవర్ కావడంతో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో ఇండియా బరిలోకి దిగనుంది. అంటే జడేజా కోసం నంబర్-1 బౌలర్ అశ్విన్ మరోసారి త్యాగం చేయాల్సి ఉంటుంది.
Translate this News: