Ind VS SA Test Series: దక్షిణాఫ్రికా(South Africa)తో ఆఖరిదైన రెండో టెస్టుకు కౌంట్‌డౌన్ మొదలైంది. రేపటి(జనవరి 3)నుంచి రెండో టెస్టు మొదలుకానుంది. కేప్ టౌన్(Cape Town)లోని న్యూస్‌ల్యాండ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాపై భారత్ రెండో టెస్ట్ ఆడనుంది. తొలి టెస్టు ఓడిపోవడంతో సిరీస్ సమం చేసుకోవడానికి ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి. డ్రా చేసుకున్నా సిరీస్ ఓడిపోయే పరిస్థితిలో టీమిండియా ఉంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోరంగా పరాజయం పాలైంది టీమిండియా. దీంతో రెండో టెస్టు కోసం పలు మార్పులు చేయనుంది.
ఆ ముగ్గురు ఔట్?
సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. టెస్టుల్లో నంబర్-1 బౌలర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ని ఆడించింది. అతను పర్వాలేదనిపించాడు. అయితే రేపటి మ్యాచ్‌కు అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా(Jadeja) తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది అంతే కాదు ఫార్మెట్‌తో సంబంధం లేదకుండా భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పేసర్ ప్రసిద్ కృష్ణను పక్కనపెట్టే అవకాశం కనిపిస్తోంది. అతని స్థానంలో ముఖేశ్‌కు తుది జట్టులో అవకాశం దక్కవచ్చు. అటు ఆల్‌రౌండర్ శార్దూల్‌ఠాకూర్ గాయంతో బాధపడుతున్నట్టు సమాచారం. అతని స్థానంలో అవేశ్‌ఖాన్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
భారత్ ప్రాబబుల్ 11: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, అవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్.
దక్షిణాఫ్రికా ప్రాబబుల్ 11 : డీన్ ఎల్గర్ (సి), ఐడెన్ మార్క్‌రామ్, టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కీగన్ పీటర్‌సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్నే (వారం), మార్కో జాన్సెన్, లుంగి ఎన్‌గిడి, కగిసో రబడ, నాండ్రే బర్గర్
Also Read: రికార్డు స్థాయిలో ఆదాయపు పన్ను రిటర్న్స్…డిసెంబర్ 31 వరకు ఎన్ని కోట్లు వచ్చాయంటే..!!