INDIA vs ENGLAND Playing 11 : హైదరాబాదీయులకు(Hyderabad) క్రికెట్ అంటే ఎనలేనీ ఇష్టం. ఎప్పుడు మ్యాచ్ జరిగిన స్టేడియంలో వాలిపోతారు. ఫార్మెట్‌తో సంబంధం లేకుండా భాగ్యనగర వాసులు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడతారు. ఈ నెల 25(రేపటి) నుంచి ఇండియా(India) వర్సెస్ ఇంగ్లండ్(England) సిరీస్ మొదలుకానున్న విషయం తెలిసిందే. తొలి టెస్టు హైదరాబాద్‌లోనే జరగనుంది. రోహిత్ శర్మ(Rohit Sharma) నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం(Rajiv Gandhi International Stadium) లో జరిగే మ్యాచ్‌తో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుండగా.. తరువాత నాలుగు రెడ్ బాల్ పోటీలు విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో జరుగుతాయి. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తగిన ఏర్పాట్లు చేసింది.
కోహ్లీ లేడు:
ఈ నెల 21న జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన విరాట్ కోహ్లీ(Virat Kohli) అనుహ్యంగా వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరం అయ్యాడు. అతని స్థానంలో ఆర్‌సీబీ ప్లేయర్ రజత్ పటిదార్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. అయితు రజత్ తుది జట్టులో ఉంటాడా లేడా అన్నది అనుమానమే. కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు వికెట్ కీపంగా చేయడం లేదని ఇప్పటికే కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రకటించాడు. అంటే కేఎస్ భరత్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఓపెనర్లగా రోహిత్‌తో యశస్వి జైస్వాల్ బరిలోకి దిగనున్నాడు. ఆ తర్వాత వన్ డౌన్‌లో శుభమన్ గిల్.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వస్తారు.
ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా:
స్వదేశంలో జరిగే మ్యాచ్‌లకు భారత్ స్పిన్ ఆయుధంతోనే బరిలోకి దిగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్‌పైనా అదే స్ట్రాటజీతో రంగంలోకి దూకనుంది భారత్. ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లతో ఆడనుంది. హైదరాబాద్ పిచ్ స్లోగా పరిగణించడమే ఇందుకు కారణం. రెండో రోజు నుంచే పిచ్‌పై టర్న్ వచ్చే అవకాశం ఉంది.
భారత జట్టు (ప్లేయింగ్ ఎలెవెన్ అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
Also Read: స్టన్నింగ్ కామెంటేటర్‌కు లైఫ్ టైం అచీవ్‌మెంట్.. బ్యాటర్ ఆఫ్ ది ఇయర్‌గా గిల్
WATCH: