T20 World Cup: గ్రూప్ ఏ నుంచి సూపర్ 8కు చేరుకున్న భారత్, అమెరికా జట్లు

పాపం పాకిస్తాన్...ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. ఇవాళ అమెరికా, ఐర్లాండ్‌తో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో...యూఎస్‌ఏ సూపర్ 8కు పాక్ ఇంటికి వెళ్ళాయి.

New Update
T20 World Cup: గ్రూప్ ఏ నుంచి సూపర్ 8కు చేరుకున్న భారత్, అమెరికా జట్లు

India, USA, Teams :అత్యంత చిన్నజట్టు అయిన యూఎస్ఏ సూపర్ 8కు చేరుకుంది. గ్రూప్‌ఏ లో భాగంగా ఫ్లోరిడాలో అమెరికా, ఐర్లాండ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఒక్క బంతి కూడా ఆడకుండానే వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. దీంతో అమెరికా సూపర్ 8లోకి దూసుకెళ్ళగా...పాకిస్తాన్ ఇంటి ముఖం పట్టింది. మొత్తం నాలుగు మ్యాచుల్లో అమెరికా ఐదు పాయింట్లు సాధించింది. పాకిస్తాన్ మూడు మ్యాచుల్లో ఒక్కదానిలోనే గెలవడంతో రెండు పాయింట్లతో మాత్రమే ఉంది. మరో మ్యాచ్ ఆడి గెలిచినా నాలుగు పాయింట్లు మాత్రమే వస్తాయి కనుక...సూపర్ 8 అర్హత సాధించలేదు. ఇప్పటికే టీమ్ ఇండియా సూపర్‌ 8కు చేరుకుంది. దాంతో పాటూ మరొక జట్టుకు మాత్రమే అవకాశం ఉండడంతో...అది కాస్తా పాయింట్ల పట్టికలో భారత్‌ తర్వాత స్థానంలో ఉన్న అమెరికా దక్కించుకుంది.

సూపర్‌ 8లో భారత్ షెడ్యూల్ ఇదే..

గ్రూప్‌ ఎలో అందరి కంటే ముందుగా టీమ్ ఇండియా సూపర్ 8కు చేరుకుంది. అందులో భారత జట్టు మూడు టీమ్‌లతో ఆడాల్సి ఉంటుంది. అందరికంటే ముందు టీమ్ ఇండియా అయితే సూపర్ 8కు వెళ్ళిపోయింది. ఇందులో అఫ్గాన్‌తో, 22న గ్రూప్‌ D2 బంగ్లాదేశ్‌ లేదా నెదర్లాండ్స్‌ టీమ్‌తో, 24న ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంటుంది. సూపర్‌-8కు చేరిన 8జట్లు రెండు గ్రూప్‌లుగా మ్యాచ్‌లు ఆడతాయి. ఒక్కో జట్టు తన గ్రూప్‌లోని మూడు జట్లతో పోటీ పడుతుంది. రెండు మ్యాచ్‌లు గెలిచిన జట్టుకు సెమీస్‌ చేరే అవకాశం ఉంటుంది.

Also Read:Andhra Pradesh: కువైట్ మృతులకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Advertisment
Advertisment
తాజా కథనాలు