International: సరిహద్దులను చెరిపేసిన ప్రేమ విడిపోయింది..బ్రేకప్ చెప్పుకున్న భారత్-పాక్ లెస్బియన్లు

ఇద్దరూ దాయాది దేశాలకు చెందినవారు. ఇద్దరూ అమ్మాయిలే. కానీ ప్రేమించుకున్నారు. ఐదేళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు సడెన్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. వీళ్ళ కథేంటో ఇక్కడ చదివేయండి.

International: సరిహద్దులను చెరిపేసిన ప్రేమ విడిపోయింది..బ్రేకప్ చెప్పుకున్న భారత్-పాక్ లెస్బియన్లు
New Update

Lesbian Break Up: ఒకరిది భారతదేశం...మరొకరిది పాకిస్తాన్. ఇద్దరు అమ్మాయిలు. అంజలి చక్ర, సూఫీ మాలిక్ వీరి పేర్లు. ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు. వీరిద్దరూ లెస్బియన్లు. అనుకోకుండా కలిసారు. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగింది. ఆ ప్రేమను ఐదేళ్ళు సాగించారు. తమ మధ్య ఉన్న లవ్‌ను ప్రపంచానికి చూపించారు. ఇద్దరూ కలిసి ఒక ఫోటో షూట్ చేశారు. దీన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఈ వీడియో వల్లనే అంజలి, సూఫీలు ఫేమస్ అయ్యారు. తరువాత ఇద్దరూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెర్స్‌గా మారారు. అప్పటి నుంచి చాలా ఫోటోలు, వీడియోలు వచ్చాయి. ఫుల్ ఫేమస్ అయ్యారు అంజలి, సూఫీలు. ఇద్దరి ప్రేమను చూసి చాలా మంది అవాక్కయితే...మరి కొంత మంది ముచ్చటపడ్డారు.

కానీ ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తున్నారు ఈ భారత-పాక్ లెస్బియన్ ద్వయం. తాము విడిపోతున్నామంటూ ప్రకటించారు. అంజలీ, సూఫీ న్యూయార్క్‌లోని ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లో 2022 లో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. ఇక త్వరలోనే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరూ విడిపోతున్నారు. దానికి కారణం సూఫీ మాలిక్. అంజలిని సూఫీ మోసం చేసింది. దానివల్లనే తాము విడిపోతున్నామని అంజలి ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. అయితే సూఫీ మీద కోసం మాత్రం ఏం లేదని చెప్పుకొచ్చింది.

సూఫీ కూడా తన తప్పును ఒప్పుకుంది. అంజలికి తాను ఊహించలేని ద్రోహం చేశానని చెప్పుకొచ్చింది. తనకు తెలియకుండానే అంజలిని విపరీతంగా బాధ పెట్టానని చెప్పింది. తాను తప్పు చేసినట్లు ఒప్పుకుని అంజలిని క్షమాపణలు కోరుతున్నాను అంటూ సూఫీ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తెలిపింది. అంజలికి తీరని ద్రోహం చేశానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇద్దరూ కూడా ఆ తప్పు ఏంటో మాత్రం చెప్పలేదు.

భారత్‌కు చెందిన అంజలి చక్ర న్యూయార్క్‌లో ఉంటోంది. సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అంజలి ఈవెంట్ ప్లానర్‌గా పని చేస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత కొన్నాళ్లు హెల్త్‌కేర్‌లో పనిచేసిన తర్వాత ఈవెంట్ ప్లానింగ్ కోసం ఆ ఉద్యోగాన్ని వదులుకుంది. తరువాత సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారింది. ఇక 27 ఏళ్ల సూఫీ మాలిక్ మొదటి నుంచీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ఇస్లాంలోని సూఫీ తత్వశాస్త్రం నుంచి ప్రేరణ పొంది తన పేరుకు ముందు సూఫీ అని పెట్టుకుంది. ఇక వీరిద్దరికీ కలిపి సూఫీ అండ్ అంజలి అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.

Also Read:Bengaluru: బైక్ డ్రైవ్ చేస్తూ ల్యాప్ టాప్ లో జూమ్ మీటింగ్.. వైరల్ అవుతోన్న బెంగళూరు ఐటీ ఉద్యోగి వీడియో!

#pakistan #usa #india #breakup #lesbians
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి