Paris: పారాలింపిక్స్‌‌లో భారత్‌కు మరో ఐదు మెడల్స్..20కు చేరిన మెడల్స్ సంఖ్య

పారిస్‌లో జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో భారత్ తన ఖాతాలో మరో ఐదు మెడల్స్‌ వచ్చి చేరాయి. దీంతో ఇప్పటి వరకు ఇండియా గెలిచిన పతకాల సంఖ్య 20కి చేరింది. మరో ఐదు అయినా కచ్చితంగా వస్తాయని పారాలింపిక్స్ ఇండియా కమిటీ ప్రెసిడెంట్ దేవేంద్ర ఝజారియా అన్నారు.

Paris: పారాలింపిక్స్‌‌లో భారత్‌కు మరో ఐదు మెడల్స్..20కు చేరిన మెడల్స్ సంఖ్య
New Update

Paralympics 2024: పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు అదరగొడతున్నారు. మామూలు ఒలిపింక్స్‌లో ఆటగాళ్ళు నిరాశర్చినా...పారా అథ్లెట్లు మాత్రం ఆశించిన దాని కంటే ఎక్కువగానే పెర్ఫామెన్స్ చేస్తూ పతకాల వేట కొనసాగిస్తున్నారు. ఈరోజు భారత్ ఖాతాలో ఐదు పతకాలు వచ్చి చేరాయి. దీంతో పతకాల సంఖ్య 20కు చేరుకుంది. మరో ఐదు అయినా కచ్చితంగా వస్తాయని పారాలింపిక్స్ ఇండియా కమిటీ ప్రెసిడెంట్ దేవేంద్ర ఝజారియా నమ్మకంగా చెబుతున్నారు. నిన్న ఒక్కరోజులోనే హ్యాట్రిక్ బంగారు మెడల్స్ వచ్చాయి. ఇవాళ జరిగిన పోటీల్లో స్ప్రింట్ దీప్తి జీవన్‌జీ కి కాంస్యం, మెన్స్ హై జంప్‌ టీ63లో శరద్‌కు సిల్వర్, మరియప్పన్ తంగవేలు కాంస్యం గెలుచుకున్నారు. వీరితో పాటూ మెనస్ జావెలిన్ త్రో ఎఫ్‌46లో అజీత్ సిల్వర్, సుందర్ సింగ్ బ్రాంజ్ గెలుచుకున్నారు. పారలింపిక్స్ చరిత్రలో భారత్ ఇన్ని మెడల్స్ సాధించడం ఇదే మొదటిసారి.

అంతకు ముందు ఎయిర్‌ రైఫిల్‌ పోటీలో ఒకరు బంగారు పతకం, మరొకరు సర్ణం సాధించారు. రాజస్థాన్‌కు చెందిన పారా షూటర్‌ అవనీ లేఖరా.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ ఎస్‌హెచ్‌ 1లో స్వర్ణం సాధించింది. అలాగే ఇదే ఈవెంట్‌లో మోనా అగర్వాల్ అనే మరో అమ్మాయి కూడా తలపడి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3లో నితేశ్‌ కుమార్ (Nitesh Kumar) స్వర్ణ పతకం గెలిచాడు. మొదటిసారి విశ్వక్రీడల్లో పాల్గొన్న నితేశ్ అరంగేట్రంలోనే పసిడి సాధించాడు. ఇప్పటికే షూటర్ అవనీ లేఖరా తొలి స్వర్ణం అందించిన విషయం తెలిసిందే. కాగా పురుషుల డిస్కస్ త్రో ఎఫ్‌56 ఈవెంట్‌లో యోగేశ్ కథునియా సోమవారం రజతం కైవసం చేసుకున్నాడు.

Also Read: USA: కమలా హారిస్ యాస పై ట్రంప్ బృందం ట్రోలింగ్..ప్రచారంలో కొత్త అస్త్రం

#medals #paralympics-2024 #paris #india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe