టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా మొదట్లో కాస్త తడబడినా మూడో వికెట్‌కు మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత జట్టు 171 పరుగులు ఇంగ్లాండకు లక్ష్యంగా ఇచ్చింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏ స్థాయిలోనూ బాగా ఆడలేకపోయారు. దీంతో ఇండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి...ఫైనల్స్‌లోకి ఎంటర్ అయిపోయారు.
టీ 20 వరల్డ్‌కప్‌లో ఓటమన్నదే లేకుండా జూతరయాత్ర చేస్తోంది టీమ్ ఇండియా. మొదట నుంచి అద్భుతంగా ఆడుతూ ఇప్పుడు ఫైనల్స్‌లోకి దూసుకెళ్ళింది. సెమీ ఫైనల్స్‌లో టఫ్ అవుతుంది అనుకున్న ఇంగ్లాండ్‌తో మ్యాచ్లో కూడా సునాయాసంగా నెగ్గేసింది. బ్యాటర్లు, బౌలర్లు సమానంగా రాణించడంతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కెప్టెప్ రోహిత్ శర్మ భాద్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 39బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57 పరుగులు చేయగా..సూర్యకుమార్ యాదవ 36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 47 పరుగులు చేసి చెలరేగాడు. తర్వాత వచ్చిన హార్ధిక్ పాండ్యా కూడా మెరుపులు మెరిపించాడు. ఇంగ్లిష్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు తీశాడు. టోప్లే, జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్, ఆదిల్ రషీద్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తర్వాత లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు అక్షర్ పటేల్ 3, కుల్‌దీప్ యాదవ్ 3, బుమ్రా 2 వికెట్లు తీయడంతో ఇగ్లాండ్ బ్యాటర్లు చకచకా ఫెవిలియన్ బాట బట్టారు. దీంతో ఇండియాకు విజయం నల్లేరు మీద నడక అయిపోయింది.