ఆసియా క్రీడలు 2023లో ఇండియా మరో స్వర్ణం సాధించింది. 25 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో ఈ పతకం దక్కింది. భారత షూటర్లు మనూ బాకర్, రిథం సంగ్వాన్, ఇషా సింగ్ లు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో 16 పతకం చేరింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఐదు వెండి, ఏడు కాంస్యాలున్నాయి.
ఇక ఈక్వెస్ట్రియన్ ఈవెంట్లో డ్రెస్సేజ్ విభాగంలో భారత్ అద్భుత విజయం సాధించింది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్ ఆసియా కప్ లో ఈక్వెస్ట్రియన్ స్వర్ణం గెలిచింది. భారత ఈక్వెస్ట్రియన్ జట్టులోని సుదీప్తి హజేలా, దివ్యకృతి సింగ్, హృదయ్ ఛెడా, అనుష్ అగర్వాలా తమ ఈక్వెస్ట్రియన్ నైపుణ్యంతో భారత్ ఖాతాలో పసిడి పతకం చేర్చారు. ఇది కాక భారత్ కు మరో 3 పతకాలు కూడా లభించాయి. ఈ మూడు పతకాలు కూడా సెయిలర్లు సాధించినవే. తొలుత మహిళల డింగీ ఐఎల్ సీఏ4 ఈవెంట్ లో నేహా ఠాకూర్ రజతం సాధించగా, పురుషుల విభాగంలో ఎబాద్ అలీ కాంస్యం సాధించి భారత శిబిరంలో ఆనందం నింపాడు. సెయిలింగ్ లో ఆర్ఎస్-x విండ్ సర్ఫింగ్ ఈవెంట్ లో ఎబాద్ అలీ మూడో స్థానంలో నిలిచాడు. ఎబాద్ అలీ ఈ ఈవెంట్ లో 52 పాయింట్ల నెట్ స్కోరు నమోదు చేశాడు. ఇక పురుషుల డింగీ ఈవెంట్ లో విష్ణు శరవణన్ కాంస్యం నెగ్గాడు. ఐఎస్ సీఏ7 విభాగంలో విష్ణు శరవణన్ 34 పాయింట్ల నెట్ స్కోరు నమోదు చేశాడు.
ఇది కూడా చదవండి: మగువలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు ..ఎంతంటే..!!
సుప్రీంకోర్టులో బాబు పిటిషన్ మీద విచారణ…17ఏ చంద్రబాబును గట్టెక్కిస్తుందా?